సినిమాల ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు యాంకర్లతో ప్రశ్నలు అడిగించడం లేదా స్టేజ్ మీద హడావిడి చేయడం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక స్టార్ డైరెక్టర్ మరో స్టార్ హీరోని ఇంటర్వ్యూ చేయడం అనేది లేటెస్ట్ ట్రెండ్. ఇందులో అందరికంటే ముందు నిలిచే పేరు సందీప్ రెడ్డి వంగా. ఆయన డైరెక్షన్ లో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో ఎదుటివారిని అడిగే ప్రశ్నల్లో కూడా అదే లెవల్ లో క్లారిటీ ఉంటుంది. అందుకే వంగ హోస్ట్ గా కనిపిస్తే చాలు ఆడియన్స్ కి ఫుల్ కిక్ వస్తుంది.
రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సమయంలో చేసిన చిట్ చాట్ నుంచి.. దేవర టైమ్ లో ఎన్టీఆర్.. కొరటాల శివలను అడిగిన ప్రశ్నల వరకు ప్రతిదీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. నానితో హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం.. రామ్ గోపాల్ వర్మ శివ రీ రిలీజ్ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలు ఒక సినిమా స్టూడెంట్ కు క్లాస్ విన్నట్లు అనిపిస్తాయి. విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరిలతో చేసిన కాంబో కూడా బాగా క్లిక్ అయ్యింది.
అసలు వంగ ఇంటర్వ్యూలను ప్రేక్షకులు ఎందుకు ఇంతగా ఇష్టపడుతున్నారు? అంటే అందులో ఏమాత్రం ల్యాగ్ ఉండదు. అనవసరమైన పొగడ్తలు.. సోది మాటలు పక్కన పెట్టి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతారు. సినిమా టెక్నికాలిటీస్ గురించి.. ఒక సీన్ వెనుక ఉన్న ఆలోచన గురించి ఆయన అడిగే విధానం బాగుంటుంది. ఏదో అడగాలి కాబట్టి అడగకుండా.. ఒక సామాన్య ప్రేక్షకుడికి ఏ డౌట్స్ వస్తాయో సరిగ్గా అవే ప్రశ్నలను ట్రిగ్గర్ చేస్తారు. అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాట సినిమా ప్రియులకు ఈజీగా కనెక్ట్ అవుతుంది.
ఇప్పుడు లేటెస్ట్ గా ది రాజాసాబ్ ప్రభాస్ తో ఆయన చేసిన ఇంటర్వ్యూ బయటకు వస్తోంది. ఇది సందీప్ రెడ్డి వంగ చేస్తున్న 6వ ఇంటర్వ్యూ. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ ని.. వంగ లాంటి కల్ట్ డైరెక్టర్ ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారో అని అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా ఒక రేంజ్ హైప్ ని క్రియేట్ చేయవచ్చని వంగ నిరూపిస్తున్నారు.
సమయం ఎలా గడిచిపోతుందో తెలియకుండా ఒక ఫ్లోలో ఇంటర్వ్యూను నడిపించడంలో ఆయనకి ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఒక డైరెక్టర్ గా అర్జున్ రెడ్డి.. యానిమల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ.. ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా ఒక కొత్త బాక్సాఫీస్ గ్రామర్ ని సెట్ చేస్తున్నారు.
ఇలా చేయడంలో మరి లాభం కూడా ఉంది. సందీప్ ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇలా ఇంటర్వ్యూలు ఇస్తుంటే జనాలకు కనెక్ట్ అయినట్లు కూడా ఉంటుంది.
This post was last modified on January 8, 2026 11:02 am
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…