Movie News

షాకింగ్… ట్విస్టింగ్… యష్ టాక్సిక్

కెజిఎఫ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న శాండల్ వుడ్ స్టార్ యష్ మార్చి 19న టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటిదాకా హీరోయిన్ల పోస్టర్లు వచ్చాయి కానీ హీరో వైపు నుంచి సాలిడ్ కంటెంట్ రాలేదనే లోటు అభిమానుల్లో ఉంది.

దాని తీర్చేందుకే యష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదిలారు. కేవలం ఒక ఎపిసోడ్ ని తీసుకుని దాన్నుంచే మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు. క్రిటికల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్ట్ ఇది.

కథేంటో చెప్పలేదు కానీ హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు. ఒక స్మశానంలో మాఫియా డాన్ కొడుక్కి దహన సంస్కారాలు జరుగుతుండగా రాయ (యష్) అక్కడికి కారులో వస్తాడు. దాన్నుంచి వైర్ల ద్వారా స్మశానం లోపల డైనమేట్లు పెట్టించి కారు నుంచి బయటికి రాకుండా బాంబులు పేల్చేస్తాడు.

అదెలా చేశాడనేది ఇక్కడ రాయడం సభ్యతగా ఉండదు కానీ అది విజువల్ గా చూస్తేనే బెటర్. మాములుగా హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కనిపించే అడల్ట్ టైప్ కంటెంట్ ఇక్కడ జొప్పించడం ఆశ్చర్యం కన్నా ఎక్కువ షాక్ కలిగిస్తుంది. యష్ ఆశించినట్టే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్టే ఉన్నాడు.

పీరియాడిక్ సెటప్ లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్చి 19 విడుదలకే కట్టుబడింది. అదే రోజు దురంధర్ 2 ఉన్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. అడవి శేష్ డెకాయిట్ కూడా సేమ్ డేట్ లాక్ చేసుకుంది. ఇవి వచ్చిన వారం రోజులకే పెద్ది దండయాత్ర ఉంటుంది.

రవి బస్రూర్ సంగీతం ఎప్పటిలాగే ఇంటెన్సిటీతో సాగగా మేకింగ్ క్వాలిటీ మాత్రం టాప్ స్టాండర్డ్ లో ఉంది. యష్ తప్ప వేరే ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. కాకపోతే మరీ ఇంత పచ్చిగా హీరో పాత్రని డిజైన్ చేయడం అది కూడా మహిళా దర్శకురాలంటే నమ్మశక్యంగా లేదు. కథ యష్ దే కాబట్టి తన ఐడియానే ఉండొచ్చు.

This post was last modified on January 8, 2026 10:39 am

Share
Show comments
Published by
Kumar
Tags: ToxicYash

Recent Posts

పిఠాపురానికి ముంద‌స్తు సంక్రాంతి!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి…

4 hours ago

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

11 hours ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

12 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

13 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

16 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

17 hours ago