సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్ కంటెంట్ బయటికి వస్తోంది. ఇప్పటిదాకా ఎమోషనల్ మూవీస్ ఎక్కువగా తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈసారి రూటు మార్చి కామెడీ జానర్ కు వచ్చేశారు.
తన శైలికి భిన్నంగా కొత్తగా ట్రై చేస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట రిలీజ్ చేసిన సాంగ్స్ ఏమో కానీ ఇటీవలే విడుదల చేసిన వామ్మో వాయ్యో పాట బాగా రీచ్ అవుతోంది. ఈ క్రమంలో ట్రైలర్ తో కథ గురించి మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
స్టోరీగా చెప్పుకుంటే ఇదేం కొత్తది కాదు. భార్య (డింపుల్ హయతి)ని ప్రాణంగా ప్రేమించే రామ్ (రవితేజ) జీవితంలో అనుకోకుండా మరో అమ్మాయి (ఆశికా రంగనాథ్) వస్తుంది. అక్కడి నుంచి డబుల్ డ్రామా మొదలవుతుంది. స్నేహితులు, బంధువులు ఎంత వారించినా ఇద్దరి మధ్య నలిగిపోయే పరిస్థితి తలెత్తుతుంది.
ఇంతకీ అందమైన వైఫ్ ఉండగా రామ్ ఇలా పక్కదారి ఎందుకు పట్టాడనేది తెరమీద చూడాలి. ట్రైలర్ ప్రారంభంలోనే జాతర ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ ఫార్ములాలు చేసి విసుగొచ్చిందని, అందుకే డాక్టర్ సలహా మేరకు కొత్త రూటు పట్టానని రవితేజతో చెప్పించడం వెరైటీగా ఉంది.
కిషోర్ తిరుమల టీమ్ తెలివిగా సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ ని వాడుకుంది. కమెడియన్ సత్య పాత్రతో వేయించిన జోకులు, జనరేటర్ లో చక్కర పోయడం ద్వారా సృష్టించిన కామెడీ అవి ఎవరిని ఉద్దేశించినవో స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు కానీ కంటెంట్ కు తగ్గట్టు బీట్స్ ఇచ్చాడు. మాస్ గోల లేకుండా రవితేజని ఇలా నవ్వించే యాంగిల్ లో చూడటం బాగుంది. హైప్ కి ట్రైలర్ ఉపయోగపడుతోంది. ఇంతే మోతాదులో హాస్యం రెండున్నర గంటల సినిమాలో ఉంటే మాత్రం జనవరి 13 భర్త మహాశయుడి లక్ష్యంగా నెరవేరినట్టే.
This post was last modified on January 7, 2026 5:25 pm
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…