గత దశాబ్ద కాలంలో బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్లలో ‘స్పోర్ట్స్ బయోపిక్’ ఒకటి. స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘బాగ్ మిల్కా బాగ్’ మొదలుకుని.. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చిన ‘ఎంస్.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ వరకు ఈ జానర్లో వచ్చిన సినిమాలు అద్భుత ఫలితాన్నందుకున్నాయి.
ఇప్పుడు కూడా సైనా, సింధు, గోపీచంద్, సానియా లాంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ జీవితాల ఆధారంగా సినిమాలు తీయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ కోవలో మరో మేటి క్రీడాకారుడి జీవిత కథకు వెండితెర రూపం కల్పించడానికి బాలీవుడ్ విలక్షణ దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్ రంగం సిద్ధం చేశాడు. తను వెడ్స్ మను, రాన్‌జానా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించిన ఈ దర్శకుడు తెరకెక్కించబోయేది చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కావడం విశేషం.
పాపులారిటీని పక్కన పెట్టి కేవలం క్రీడల్లో ఘనతలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఇండియాలో ఆనంద్‌ను మించిన క్రీడాకారుడు మరొకరు ఉండరు. మనకున్న క్రికెట్ పిచ్చి వల్ల సచిన్, ధోని, కోహ్లి లాంటి క్రికెట్ సూపర్ స్టార్లను పిచ్చిగా ఆరాధిస్తాం కానీ.. ఆనంద్ ఘనతల ముందు వాళ్లు సాధించింది తక్కువే. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనుడు ఆనంద్.
చెస్‌లో ఇండియాకు ఏమంత పేరు లేని సమయంలో, మన వాళ్లు ప్రపంచ స్థాయిలో పోటీ పడటమే గొప్ప అనుకున్న తరుణంలో కాస్పరోవ్, క్రామ్నిక్ లాంటి రష్యా దిగ్గజాలను వెనక్కి నెట్టి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఏకంగా ఐదు టైటిళ్లు సాధించి ఔరా అనిపించాడు. ఇక ఆనంద్ పనైపోయింది అనుకున్నాక కూడా గత ఏడాది ర్యాపిడ్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్ అయి తన సత్తాను చాటుకున్నాడు ఆనంద్. ఈ చెన్నై మేధావి జీవితంలో మలుపులకు, డ్రామాకు లోటు లేదు కాబట్టి సరిగ్గా తీస్తే ఈ బయోపిక్ బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది.
This post was last modified on December 13, 2020 2:06 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…