Movie News

అవాంతరాలు ఆందోళన మధ్య జన నాయకుడు

ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్మాతలు అత్యవసరంగా కోర్టుని ఆశ్రయించారు. అయితే హియరింగ్ రేపటికి వాయిదా పడటంతో అభిమానులు నరాలు తెగే టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.

ఇదే సమయంలో విజయ్ కి సిబిఐ నోటీసులు రావడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఇప్పుడు జన నాయకుడు ముందున్న ఆప్షన్లు మరింత ఆందోళన రేపుతున్నాయి. సెన్సార్ చెప్పిన కట్స్ మ్యూట్స్ అన్నీ ఫాలో కావడం వాటిలో ముఖ్యమైంది. కానీ దానికి టీమ్ సిద్ధంగా లేదు.

రెండోది కోర్టు జడ్జ్ మెంట్ కనక కొంచెం అటుఇటు అయితే విడుదలని వాయిదా వేసుకోవడం. దీని వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోయాయి. చాలా చోట్ల ఆఫ్ లైన్ లో టికెట్లు అమ్మేశారు. పరాశక్తితో స్క్రీన్ షేరింగ్ వల్ల డిస్ట్రిబ్యూటర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జన నాయకుడు వాయిదా వేసే ఛాన్స్ లేదు.

నిర్మాత ధీమాగా క్లియరెన్స్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారట. తమిళనాడు ఎగ్జిబిటర్లు నిమిషమొక యుగంగా గడుపుతున్నారు. ఏపీ తెలంగాణలో ఇబ్బంది లేదు. ఆల్రెడీ మన స్ట్రెయిట్ సినిమాల పోటీనే తీవ్రంగా ఉంది కాబట్టి ఒత్తిడి ఉండదు.

ఈ పరిణామాలన్నీ విజయ్ రాజకీయ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తోందనే కామెంట్స్ అభిమానుల నుంచి వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైం లేదు. ముందు పరిష్కారం చూడాలి. జనవరి 9 ఎలాంటి ఆలస్యం లేకుండా షోలు పడేలా చూసుకోవాలి.

ఓవర్సీస్ కాపీలు డెలివరీ అయ్యాయి కానీ కీ డిస్పాచ్ కావాలంటే ల్యాబ్, కోర్టు నుంచి క్లియరెన్స్ రావాలి. యుఎస్ లో కూడా టికెట్లు అమ్మేసి పెట్టారు. ఇన్ని అవాంతరాలు ఆందోళన మధ్య శుక్రవారం ఉదయం అనుకున్న టైంకి షోలు పడాలని ఫ్యాన్స్ కోటి దేవుళ్ళకు దండం పెట్టేస్తున్నారు. వాళ్ళ మొర ఆలకిస్తారో లేదో చూడాలి.

This post was last modified on January 6, 2026 5:18 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago