సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ వారణాసి విడుదల గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. 2027 మార్చి చివరి వారమని ఒక వర్గం, కాదు శ్రీరామనవమికి రిలీజని మరొకరు గాసిప్స్ ని తిప్పడం మొదలుపెట్టారు. నిజానికి జక్కన్న ఇంకా నిర్ధారణగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆ మాటకొస్తే ఆయనకూ క్లారిటీ లేదు.
ఎందుకంటే షూటింగ్ ఒకవేళ వేగంగా పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందులోనూ ఐమాక్స్, డాల్బీ సినిమా లాంటి లేటెస్ట్ టెక్నాలజీలు వాడుతున్నారు కాబట్టి అవుట్ ఫుట్ అంత ఆషామాషీగా తేలదు.
అందుకే హైదరాబాద్ లో జరిగిన టైటిల్ లాంచ్ ఈవెంట్ లో ఆయన నోటి వెంట రిలీజ్ డేట్ ప్రస్తావన రాలేదు. ఇతరులు హింట్ ఇచ్చారు తప్పించి కన్ఫర్మ్ చేసినవాళ్లు ఎవరూ లేరు. ఇంకా సగం షూట్ లో ఉన్న వారణాసికి సంబంధించి కీలక షెడ్యూల్స్ మొదలుపెట్టాల్సి ఉంది. రాజమౌళి ఫోకస్ మొత్తం వీటిపైనే ఉంది. పాటల చిత్రీకరణ ప్లానింగ్ వేరే ఉంది.
చూస్తేనేమో 2026 వచ్చేసింది. చేతిలో ఉన్న సంవత్సరం టైంలో ఇవన్నీ మేనేజ్ చేయగలరా అంటే సందేహమే. క్వాలిటీ విషయంలో రాజీ పడని రాజమౌళి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరనేది తెలిసిన విషయమే. ఆర్ఆర్ఆర్ టైంలోనూ ఈ పట్టుదల చూపించారు.
కాకపోతే వారణాసి ఒక్క విషయం మీద మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టాలి. 2027లోనే అల్లు అర్జున్ – అట్లీ మూవీ వస్తుంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ కనక ఈ ఏడాది రాకపోతే అది కూడా నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ అవుతుంది. ప్రభాస్ స్పిరిట్ పోటీ రేసులోకి ఎంటర్ కావొచ్చు.
ఇవన్నీ ఒకదానితో మరొకటి క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటేనే వరల్డ్ వైడ్ భారీ వసూళ్లకు ఛాన్స్ దొరుకుతుంది. అందుకే ముందు డేట్ అనౌన్స్ చేస్తే మిగిలిన ప్రొడ్యూసర్లకు క్లారిటీ వస్తుంది. కానీ రాజమౌళికి ఎంత కమిట్ మెంట్ ఉన్నా ప్రతిదీ ఆయన చేతిలో ఉండదు కాబట్టి 2027లో వారణాసి ఎప్పుడు వస్తుందనేది సస్పెన్సే.
Gulte Telugu Telugu Political and Movie News Updates