సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం వెనక్కి నెట్టి తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరో పోటీలో కొనసాగుతున్నాడు విజయ్. ఇలాంటి పొజిషన్‌ను వదిలేసి అతను పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీ పెట్టిన విజయ్ ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నాడు.
విజయ్ పార్టీ ఇప్పటికే తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేయగలిగింది. కరూర్ తొక్కిసలాట విషాదాన్ని పక్కన పెడితే.. విజయ్‌కి సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. విజయ్‌కి ఉన్న జనాదరణకు తోడు తమిళనాట ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తొలి ఎన్నికల్లో అతను మంచి ఫలితాలే రాబడతాడని, కింగ్ మేకర్ కాగలడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టే ముందు చివరగా ‘జననాయగన్’ అనే చిత్రంతో అతను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సంక్రాంతికి. నిన్ననే ఈ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ అయింది.
‘జననాయగన్’ అని పేరు పెట్టుకోవడంతోనే ఈ చిత్రాన్ని పొలిటికల్ మైలేజీ కోసం విజయ్ బాగానే వాడుకోబోతున్నాడని అర్థమైంది. ఇక ట్రైలర్ చూస్తే.. సినిమాకు పొలిటికల్ కలర్ బాగానే అద్దినట్లు స్పష్టమైంది. ‘‘అర్హత లేని వాళ్లంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు’’.. ‘‘ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికేంట్రా రాజకీయాల్లోకి వచ్చేది’’.. ‘‘నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అని ఎవ్వడు చెప్పినా సరే, తిరిగెళ్లే ఐడియానే లేదు. ఐయామ్ కమింగ్’’.. లాంటి డైలాగులతో తన రాజకీయ ప్రత్యర్థుల మీద పరోక్షంగా గట్టి పంచులే వేశాడు విజయ్.
ఇంకోవైపు విజయ్ పార్టీ సింబల్‌ను పోలినట్లుగా రెండు ఏనుగులల మధ్య విజయ్ నిలబడి ఉన్న ఒక ఫ్రేమ్‌ను ట్రైలర్లో చూడొచ్చు. ఈ చిత్రంలో విజయ్ పేరు కూడా పొలిటికల్ టచ్ ఉన్నదే. ‘దళపతి వెట్రి కొండాన్’.. ఇదీ సినిమాలో విజయ్ పేరు. ఇంగ్లిష్‌లో షార్ట్ చేస్తే ‘టీవీకే’ అని వస్తుంది. తన పార్టీ షార్ట్ నేమ్ కూడా అదే అన్న సంగతి తెలిసిందే. దళపతి వెట్రి కొండాన్ అంటే ‘దళపతి విజయాన్ని తీసుకొస్తాడు’ అని అర్థం. అంటే రాబోయే ఎన్నికల్లో తాను గెలవబోతున్నాననే సంకేతాన్ని విజయ్ ఇచ్చాడన్నమాట.
This post was last modified on January 4, 2026 1:48 pm
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…
ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…