Movie News

విజయ్ ట్రైలర్… ఏఐతో కట్ చేశారా?

జననాయగన్.. జననాయగన్.. ఇప్పుడు తమిళ సినీ జనాలందరి నోళ్లలోనూ ఇదే మాట నానుతోంది. అక్కడ నంబర్ వన్ స్థానంలో ఉన్న విజయ్ నుంచి వస్తున్న చివరి చిత్రం ఇదే. నిన్న రాత్రి రిలీజైన ‘జననాయగన్’ ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేసింది. తమిళ చిత్రాల ట్రైలర్ల వ్యూస్, లైక్స్ రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొడుతూ సాగుతోంది. ట్రైలర్ చూసిన విజయ్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. 

విజయ్ మార్కు కమర్షియల్ హంగులకు తోడు.. తన పొలిటికల్ కెరీర్‌ను ఉపయోగపడే అంశాలను కూడా జోడించి పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ఫిలింగా దీన్ని తీర్చిదిద్దారంటూ వాళ్లు ట్రైలర్‌ను కొనియాడుతున్నారు. అదే సమయంలో దీని మీద విమర్శలు కూడా తక్కువగా ఏమీ లేవు. ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ రీమేకా కాదా అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. 

బాలయ్య సినిమాను చాలా చోట్ల యాజిటీజ్ దించేశారు. లొకేషన్స్, షాట్స్, డైలాగ్స్, ప్రధాన నటీనటుల మేకోవర్ విషయంలో ఒరిజినల్‌‌ను ఫాలో అయిపోయారని స్పష్టంగా తెలిసిపోయింది. ఒరిజినల్‌ నుంచి ఈ స్థాయిలో సన్నివేశాలను తీసుకుని.. మళ్లీ దీన్ని రీమేక్ అనలేం, ఇది విజయ్ ఫిలిం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం ‘జననాయగన్’ మేకర్స్‌కే చెల్లింది అంటూ తెలుగు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘జననాయగన్’ ట్రైలర్‌ను ఏఐ సాయంతో కట్ చేసిన విషయం సోషల్ మీడియా పట్టేసింది. ట్రైలర్లో ఒక చోట ‘జెమిని’ ఏఐ టూల్ సింబల్ కనిపించింది. ఆ వాటర్ మార్క్ చాలా చిన్నగా ఉన్నా సరే.. నెటిజన్లు దాన్ని తెలివిగా పట్టేశారు. దీన్ని బట్టి ట్రైలర్‌ను ‘జెమిని’ సాయంతోనే కట్ చేశారని అర్థమైపోయింది. కట్ చేస్తే చేశారు కానీ.. ఇంత పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తూ వాటర్ మార్కు తీసేయాలన్న కామన్ సెన్స్ లేకపోయిందే.. ఇంత నిర్లక్ష్యమా అంటూ ‘జననాయగన్’ టీంను తప్పుబడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on January 4, 2026 1:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jana Nayagan

Recent Posts

కేసరి ట్రెండింగ్… నాయకుడు ట్రోలింగ్

ముందు నుంచి జన నాయకుడు దేనికీ రీమేక్ కాదని దబాయిస్తూ వచ్చిన టీమ్ ట్రైలర్ తర్వాత సైలెంటయిపోయింది. మూడు నిమిషాల…

15 minutes ago

చిరు.. విజ‌య్.. బాల‌య్య‌.. ఒక రీమేక్ స్టోరీ

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ చివ‌రి సినిమా జ‌న‌నాయ‌గ‌న్ ఈ సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతోంది.…

2 hours ago

మాళ‌విక డెబ్యూ… విజయ్ తో అనుకుంటే ప్రభాస్ తో

పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌ముందే త‌న హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది మ‌ల‌యాళ భామ…

4 hours ago

ప్రేమమ్ హీరో కమ్ బ్యాక్ అదిరింది

నివిన్ పౌలీ.. ఒక‌ప్పుడు సౌత్ ఇండియా అంత‌టా మార్మోగిన పేరు. ఈ మ‌లయాళ హీరో ప్ర‌ధాన పాత్ర పోషించిన ప్రేమమ్…

7 hours ago

విజ‌య్‌తో క్లాష్‌… వివాదానికి తెర‌దించిన హీరో

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్‌వ‌న్ హీరోల్లో ఒకడిగా కొన‌సాగుతున్న విజ‌య్.. జ‌న‌నాయ‌గ‌న్ చిత్రంతో సినిమాల‌కు వీడ్కోలు ప‌లుకుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ…

13 hours ago

వరప్రసాద్ గారి వినోదాల విందు

సంక్రాంతి రేసులో రాజా సాబ్ తర్వాత ఎక్కువ అంచనాలు మోస్తున్న సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు మీద మెగా ఫ్యాన్స్…

19 hours ago