జన నాయకుడు ట్రైలర్ వచ్చాక అందరి డౌట్లు తీరిపోయాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జరుగుతూనే ఉంది కానీ టీమ్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అనిల్ రావిపూడి, హెచ్ వినోత్ దీని గురించి నేరుగా స్పందించకుండా దాటవేస్తూ వచ్చారు. ఇవాళ ఫుల్ క్లారిటీ వచ్చింది.
సగం ట్రైలర్ పైగా విజువల్స్ రెండు సినిమాల్లో ఒకేలా అనిపించాయి. ఫ్యాక్టరీ ఫైట్ తో మొదలుపెట్టి జైలు ఎపిసోడ్ దాకా మక్కికి మక్కి అనిపించేంత పోలికలున్నాయి. పొలిటికల్ గా అదనపు మెరుగులు దిద్దారు కానీ ఓవరాల్ గా చూసుకుంటే సేటు టు సేమ్ అంటూ ట్విట్టర్ లో స్క్రీన్ షాట్లు పెట్టేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎంత రీమేక్ అయినా భగవంత్ కేసరిలో ఉన్న ఇంటెన్సిటీ ఇప్పుడీ జన నాయకుడులో కనిపించలేదనే చెప్పాలి. బడ్జెట్ పరంగా పెద్దదే కావొచ్చు కానీ అనిల్ రావిపూడి టేకింగ్, బాలయ్య వయసు ప్లస్ హుందాతనం, తమన్ మ్యూజిక్ ఏవైతే మెయిన్ హైలైట్స్ గా నిలిచాయో అవి విజయ్ మూవీలో మిస్ అయినట్టుగా కనిపిస్తోంది.
పైగా బాబీ డియోల్ విలనిజంని మరింత వయొలెంట్ గా మార్చడంతో పాటు డార్క్ నైట్ తరహాలో ఏదో రోబోటిక్ తరహా పోరాట సన్నివేశాలు పెట్టడం కొంత ఆర్టిఫీషియల్ లుక్ ఇచ్చింది. ఇదంతా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసమే కావొచ్చు కానీ సగటు ఆడియన్స్ కోణం నుంచి చూస్తే ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి.
రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ఏరికోరి మరీ భగవంత్ కేసరిని ఎంచుకున్నాడు. అనిల్ రావిపూడిని పిలిపించి మరీ సూచనలు తీసుకున్నాడు. రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని అడిగాడట కానీ కమిట్ మెంట్ల దృష్ట్యా అనిల్ ఒప్పుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చూసిన కథనే మళ్ళీ జన నాయకుడులో మన జనాలు చూస్తారానేది వేయి డాలర్ల ప్రశ్న. స్ట్రెయిట్ సబ్జెక్టు అయ్యుంటే ఖచ్చితంగా తెలుగు సినిమాలకు కాంపిటీషన్ అయ్యేది కానీ రీమేక్ అయిపోయి ఆ ఛాన్స్ తగ్గించేసుకుంది. మరి తమిళ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on January 3, 2026 10:56 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా…
గత కొన్నేళ్లుగా స్టార్లు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలు సెన్సార్ విషయంలో రాజీ పడకుండా A సర్టిఫికెట్ తీసుకోవడానికి వెనుకాడని…
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం…
యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో…
నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానుల వరకు బాగుందనిపించింది కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో కొంత…
పూనమ్ కౌర్ పంజాబీ అమ్మాయే అయినా.. తెలుగులోనే సినిమాలు చేసింది. సినిమా అవకాశాలు తగ్గాక కూడా ఆమె ఇక్కడే ఉంటోంది.…