సంక్రాంతి సినిమాల్లో పూర్తి స్థాయి సౌండ్ చేయడంలో కొంచెం వెనుకబడిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పాటలు, ఈవెంట్లు ఓకే అనిపించుకున్నాయి తప్ప ఎక్స్ ట్రాడినరి కాదు. ఒక సాలిడ్ పుష్ కోసం ఎదురు చూస్తున్న టీమ్ కు తాజాగా రిలీజైన ‘వాయ్యో వాయ్యో వొలెన్కనో’ పాట పక్కా తెలంగాణ స్లాంగ్ తో కొత్తగా అనిపించే సౌండ్ తో మ్యూజిక్ లవర్స్ ని వేగంగా ఆకట్టుకుంటోంది.
కాకపోతే స్మూత్ ఫోక్ సాంగ్ ని ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ షో తరహాలో చిత్రీకరించడం మాస్ కోసమే అయినా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. కొన్ని కొన్ని పదాలు అర్ధం కావట్లేదనే టాక్ కూడా వచ్చింది.
సరే ఏదైతేనేం భీమ్స్ రేంజ్ లో ఒక మంచి మాస్ బీట్ కోసం ఎదురు చూసిన రవితేజ అభిమానులను వామ్మో వాయ్యో మొదటి కార్యం నెరవేర్చింది. నెక్స్ట్ టార్గెట్ ట్రైలర్. భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయే హీరో పాత్రను అంగీకరించిన మాస్ మహారాజాను దర్శకుడు కిషోర్ తిరుమల ఎంత కొత్తగా ప్రెజెంట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
ఇలాంటి ఫార్ములాతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎలాంటి ట్రీట్ మెంట్ తో తీశారో చూడాలి. టీజర్ వరకు ట్విస్టులు ఏవీ రివీల్ చేయకుండా జాగ్రత్త పడిన టీమ్ అసలు స్టోరీని ట్రైలర్ లో వదలుతారేమో చూడాలి.
ఇక పోటీ విషయానికి వస్తే జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి వచ్చే సమయానికి రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు టాక్స్ పూర్తిగా బయటికి వచ్చేసి ఉంటాయి. వాటి స్టామినా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. జన నాయకుడు రిజల్ట్ కూడా తెలిసిపోతుంది.
దానికి అనుగుణంగా భర్త మహాశయుడికి ప్రమోషనల్ ప్లాన్ ఫ్రెష్ గా వేసుకోవచ్చు. డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ ఎంటర్ టైనర్ లో క్యాస్టింగ్ పెద్దదే ఉంది. రొటీన్ మాస్ తో అభిమానులను బాగా విసిగించేసిన రవితేజ ఈసారి ఫ్రెష్ గా వినోదంతో పలకరించబోతున్నాడు కాబట్టి ఎలా మెప్పిస్తాడా ఇంకో పది రోజుల్లో తేలనుంది.
This post was last modified on January 3, 2026 10:46 pm
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…
ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…