తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో అతను తెలుగు ప్రేక్షకులను ఎలా నవ్వుల్లో ముంచెత్తాడో తెలిసిందే. ప్రభాస్‌తో తీసిన ‘రాజాసాబ్’లో సైతం కామెడీ బాగానే ఉండబోతోందని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.
ఐతే కామెడీ ఒక పార్ట్‌గా కాకుండా.. కేవలం కామెడీనే ప్రధానంగా ఒక సినిమా తీయాలనేది తన కల అంటున్నాడు మారుతి. తెలుగులో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లకు తోడు.. కమల్ హాసన్‌ను పెట్టి ‘పంచతంత్రం’ లాంటి సినిమా తీయాలని ఉందని.. అందుకోసం సీరియస్‌గా ప్రయత్నం కూడా చేస్తానని అతను ఒక పాడ్ కాస్ట్‌లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
‘‘నేను ఒక పంచతంత్రం లాంటి సినిమా తీస్తాను.. ఆ రోజు థియేటర్ బ్లాస్ట్ అవుతుంది. నాకు అలాంటి సినిమా రాసేంత కెపాసిటీ ఉంది. కంటెంట్ ఉంది. అలాంటిది నాకు చెయ్యాలనేది ఉంది. నాకు మల్టీస్టారర్ చేయాలని ఉంది. నలుగురు.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, కమల్ హాసన్.. ఈ ఐదుగురితో కలిసి సినిమా చేయాలన్నది నా ఆలోచన. మనకింక ఆ సినిమా అలా ఉండిపోవాలి’’ అని మారుతి వ్యాఖ్యానించాడు.
ఐతే మారుతి ఆలోచన బాగానే ఉంది కానీ.. ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. తెలుగు సీనియర్ హీరోల్లో ఇద్దరిని కలిపి సినిమా తీయడం వరకు ఓకే కానీ.. నలుగురిని ఏకతాటిపైకి తేవడమే చాలా కష్టం.
అలాంటిది వీరికి తోడు కమల్ హాసన్ అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి మారుతి కల కలగానే మిగిలిపోక తప్పదేమో. కానీ ఆర్టిస్టులు ఎవరన్నది పక్కన పెడితే.. అతను ‘పంచతంత్రం’ లాంటి కామెడీ సినిమా చేస్తే మాత్రం వర్కవటువుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 3, 2026 8:28 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…