పైకేమో ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి.. అన్ని సినిమాలు ఆడాలి అంటూ సినీ జనాలు స్టేట్మెంట్లు ఇస్తుంటారు కానీ.. తెర వెనుక మాటలు వేరే ఉంటాయన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. పోటీ ఉన్నపుడు అవతలి సినిమా పోవాలని కోరుకునేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. కొన్ని సినిమాలకు వ్యతిరేకంగా నెగెటివ్ క్యాంపైనింగ్ చేయించే వాళ్లూ లేకపోలేదు.
సంక్రాంతికి ఈసారి విపరీతమైన పోటీ ఉండగా.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఫ్లాప్ కావాలని ఇండస్ట్రీలోనే కొన్ని వర్గాలు కోరుకుంటున్నట్లుగా ఓ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్లనూ చూడొచ్చు. ఇదే విషయం మీద దీని దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.
రాజాసాబ్ ఫ్లాప్ కావాలని సినీ జనాలు కోరుకోవడంలో ఆయన ఒక పాజిటివ్ కోణాన్నే చూశాడు. ఈ సినిమా బాగా ఆడితే తాను దొరకనేమో ఉద్దేశంతో కొందరు ఫ్లాప్ కావాలని కోరుకుంటూ ఉండొచ్చని మారుతి వ్యాఖ్యానించడం విశేషం.
”ఈర్ష్య, అసూయ మానవ నైజం. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కోరుకుంటూ ఉంటారు. పక్కింటి వాళ్లు కారు కొనుక్కుంటే దానికి ఏదైనా అవ్వాలని కోరుకోవచ్చు. నేను సక్సెస్ అయ్యి ఎదిగితే వాళ్లకు దొరకనేమో అనే భయంతో నా సినిమా ఫ్లాప్ కావాలని కొందరు అనుకోవచ్చు. నేను ఇప్పుడు చిన్న సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లకు వెళ్తున్నా. ఒకవేళ నాకు భారీ సక్సెస్ వస్తే.. అలా రానేమో అని వాళ్ల భయం కావచ్చు.
ఈసారి కథ చెబుదామని నా దగ్గరికి వస్తే నేను పట్టించుకోనని వాళ్లు అనుకుంటారు. అదే ఫెయిలైతే మనల్ని చూస్తాడని వాళ్లు భావిస్తారు. వాళ్లు అసూయ వల్ల అలా అనుకుంటారేమో కానీ.. నేను అలా ఆలోచించేవాడిని కాదు. నేనెప్పుడూ స్టార్‌డం శాశ్వతం అనుకోను. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలని అనుకుంటే అలాగే తీస్తాను.
నా దగ్గర చాలా కథలున్నాయి. పెద్ద స్టార్‌తో సినిమా చేశా కదా.. అన్నీ ఆ స్థాయిలోనే ఉండాలనే కోరికలు నాకు లేవు. నాకు కథ ముఖ్యం. ఏ హీరో సెట్ అయితే తనతోనే తీస్తా. ఎవరితో చేసినా ఎప్పుడూ పని ఉండాలని మాత్రం కోరుకుంటా” అని మారుతి స్పష్టం చేశాడు.
This post was last modified on January 2, 2026 7:49 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…