మహిళల వస్త్రధారణ గురించి సీనియర్ నటుడు శివాజీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లలో యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ఒకరు. చిన్మయి కూడా గట్టిగానే గళం విప్పినప్పటికీ.. ఆమె తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ అనసూయ మాత్రం ఊరుకోలేదు.
శివాజీతో మాటల యుద్ధాన్ని కొనసాగించింది. సోషల్ మీడియాలో అనసూయ మీద నెటిజన్లు పెద్ద ఎత్తునే దండెత్తి వచ్చినా.. ఆమెను విపరీతంగా ట్రోల్ చేసినా ఆమె తగ్గలేదు. ప్రకాష్ రాజ్ సహా కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. వారం రోజుల అవిశ్రాంతంగా పోరాడిన అనసూయ.. చిన్న గ్యాప్ తీసుకుని, తనదైన శైలిలో ఒక సోషల్ మీడియా పోస్టుతో తన ట్రోలర్స్‌కు పంచ్ వేసింది.
కొత్త ఏడాది నేపథ్యంలో తన భర్త భరద్వాజ్‌తో కలిసి అనసూయ వెకేషన్‌కు వెళ్లింది. ఆ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. సముద్రంలో జలకాలాడుతున్న తన ఫొటోలను చూస్తే.. ఎవరేమనుకున్నా, విమర్శలు చేసినా తాను తగ్గేది లేదనే సంకేతాలు ఇస్తున్నట్లే ఉంది. వెకేషన్‌కు వెళ్లి బికినీల్లో ఫొటోలకు పోజులివ్వడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు.
కానీ శివాజీ వివాదం నేపథ్యంలో తన కొత్త ఫొటోలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మహిళల వస్త్రధారణ గురించి చర్చ జరుగుతున్న టైంలో తన ఛాయిస్ తనదే అని చాటి చెబుతూ ఆమె అందాల ప్రదర్శన చేస్తున్న ఫొటోలను పంచుకుని తన దారి తనదే అని చెప్పకనే చెప్పింది. తన డ్రెస్సింగ్, హాట్ లుక్ గురించి ఎప్పట్లాగే కామెంట్లు వస్తున్నప్పటికీ ఆమె వాటిని అస్సలు పట్టించుకోదని వేరే చెప్పాలా?
This post was last modified on January 2, 2026 7:40 am
తెలుగులో చాలామంది స్టార్లు ఉన్నారు. వారికి రకరకాల ట్యాగ్స్ ఉన్నాయి. కానీ యాటిట్యూడ్ స్టార్ అని ఒక ట్యాగ్ పెట్టుకుని…
‘శంబాల’కు ముందు ఆది సాయికుమార్ ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో ఆకట్టుకున్న…
వరస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా రూటు మార్చి పీరియాడిక్ సెటప్స్ వైపు…
తమిళనాడులో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ హిందీ భాషను బలవంతంగా కేంద్రం తమ ప్రజలపై రుద్దాలని చూస్తోందని విమర్శిస్తున్న…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్…
రెడ్ బుక్ ను చూస్తే వైసీపీ నేతలు వణికిపోతున్నారని, రకరకాల సాకులు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని మంత్రి లోకేశ్ విమర్శలు…