మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నుంచి ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఎల్-2: ఎంపురాన్’ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా మాలీవుడ్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రం రూ.270 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన లాల్ సినిమా ‘తుడరమ్’ ఇండియా వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రం రూ.240 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది.
ఆపై మోహన్ లాల్ నుంచి వచ్చిన క్లాస్ మూవీ ‘హృదయపూర్వం’ కూడా రూ.100 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇలాంటి ఊపులో ఉన్న హీరో నుంచి ఏడాది చివర్లో వచ్చిన ‘వృషభ’ మాత్రం ఘోరమైన ఫలితాన్ని అందుకుంది. బజ్ లేకుండా రిలీజై, దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ఫుల్ రన్లో కనీసం రూ.2 కోట్ల వసూళ్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. క్రిస్మస్ వీకెండ్లో లాల్ సినిమా రిలీజైతే ఇంత ఘోరమైన పరిస్థితి ఉండడం అనూహ్యం.
మోహన్ లాల్ సినిమాను ఆయన అభిమానులే చూడలేదన్నది స్పష్టం. ఈ సినిమా మీద పెట్టిన ఖర్చు సంగతి పక్కన పెడితే.. కనీసం రిలీజ్, పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఆడించినందుకు అదనంగా ఖర్చయింది. అంటే థియేటర్ల నుంచి మొత్తంగా ఒక్క రూపాయి కూడా రాలేదన్నమాట.
మామూలుగా మోహన్ లాల్ సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కులు ఈజీగా సేల్ అయిపోతాయి. కానీ ‘వృషభ’ విషయంలో అలా జరగలేదు. ఆ రైట్స్ అమ్ముడవకుండానే సినిమాను రిలీజ్ చేశారట. ఇప్పుడు చూస్తే సినిమాకు బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం వచ్చింది. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడవడం ఇంకా కష్టం. దీంతో ఈ మార్గంలో కూడా నిర్మాతలకు ఏ ఆదాయం లేనట్లే. మొత్తంగా ఈ సినిమాపై ఎంత బడ్జెట్ పెడితే.. అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on January 2, 2026 7:36 am
ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం.…
సెలబ్రిటీల జీవితం పైకి ఎంత ఆకర్షణగా కనిపిస్తుందో లోపల అంత ఘర్షణ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా…
బీజేపీతో ప్రతిపక్ష బీఆర్ఎస్ లోపాయికారీగా పొత్తు పెట్టుకుందని అధికార కాంగ్రెస్ పార్టీ తరచుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి…
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…