ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు ఉంటాయా ఉండవాని ఫీలైన అభిమానులకు శుభవార్త చెబుతూ మరో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇది పాత వార్తే అయినా అధికారిక ముద్ర లేకపోవడంతో పలు అనుమానాలు ఫ్యాన్స్ ని తెగ నలిపేశాయి. ఫైనల్ గా వాటికి చెక్ పడింది.
రామ్ తాళ్ళూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ డ్రామాకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. ఏజెంట్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సూరి ఈసారి పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారట. తన ఆస్థాన రచయిత వక్కంతం వంశీ ఇచ్చిన కథతో ఇది తెరకెక్కబోతోందని సమాచారం. బడ్జెట్ కూడా పెద్దదేనట.
ఇచ్చిన మాట కోసం పవన్ ఈ కమిట్ మెంట్ కి కట్టుబడి ఉన్నారని చెప్పాలి. అడ్వాన్స్ ఎప్పుడో ఎన్నికల్లో గెలవడానికి ముందు తీసుకున్నారు. అనౌన్స్ మెంట్, ఆఫీస్ పూజా ఎప్పుడో జరిగిపోయింది. జనసేన గెలిచి కూటమిలో భాగమయ్యాక దీని గురించి అప్డేట్స్ లేకుండా పోయాయి.
ఈలోగా హరిహర వీరమల్లు, ఓజి విడుదలైపోగా ఉస్తాద్ భగత్ సింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సురేందర్ రెడ్డి వంతు. ఈయనకు మరో ఘనత దక్కింది. మెగా బ్రదర్స్ ని డైరెక్ట్ చేసిన అతి కొద్దీ దర్శకుల లిస్టులో చేరిపోయారు. చిరంజీవితో సైరా నరసింహరెడ్డి తర్వాత పవన్ కాంబో ఇలా కుదిరింది.
ఎలక్షన్స్ ఇంకా చాలా దూరం ఉన్నాయి కాబట్టి పవన్ సినిమాలు చేసేందుకు తగిన సమయమైతే ఉంది. ఇప్పుడు చూస్తున్న హెయిర్ స్టైల్ ప్రత్యేకంగా సురేందర్ రెడ్డి కోసం చేయించుకున్నదేనని ఇన్ సైడ్ టాక్. ఇన్ సైడ్ లీక్స్ అయితే మిలిటరీ ఆఫీసర్ తరహా క్యారెక్టర్ ఉంటుందని, దాని కోసమే కురచగా జుత్తు కత్తిరించుకున్నారని అంటున్నాయి.
సంగీత దర్శకుడు, హీరోయిన్, ఇతర టెక్నికల్ టీమ్ తదితర వివరాలు ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. షూటింగ్ కనక వేగంగా చేసుకోగలిగితే 2026లోనే పవన్ మళ్ళీ స్క్రీన్ మీద చూడొచ్చు. కాకపోతే అది రాజకీయ, సామజిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం.
This post was last modified on January 1, 2026 11:48 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…