ఒకే భాషలో విడుదలై ప్యాన్ ఇండియా ట్యాగ్ లేకుండా 1100 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్న దురంధర్ వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందంటే నమ్మడం కష్టం కానీ ఇది నిజం. మిడిల్ ఈస్ట్ మార్కెట్ కిందకు వచ్చే యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్ లాంటి దేశాల్లో దురంధర్ ని బ్యాన్ చేయడం వల్ల 90 కోట్లు నష్టపోయామని డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన ప్రణబ్ కపాడియా పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆయా చట్టాలను గౌరవించి ముందుకు సాగడం తప్ప ఏం చేయలేమని, నిషేధం కారణంగా భారీ ఎత్తున రెవిన్యూ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తారు. లేదంటే నెంబర్లు ఇంకా పెద్దగా ఉండేవి.
పాకిస్థాన్ మాఫియా మీద తీసిన సినిమా అయినప్పటికీ దురంధర్ లో మతపరమైన అంశాలతో పాటు బలూచిస్తాన్ తదితర సున్నితమైన విషయాల ప్రస్తావన ఉండటంతో అరబ్ దేశాలు దురంధర్ స్క్రీనింగ్ ని అడ్డుకున్నాయి. శత్రుదేశంలో షోలు లేకపోయినా రెండు మిలియన్లకు పైగా ప్రేక్షకులు టొరెంట్లు డౌన్ లోడ్ చేసుకుని మరీ చూశారంటే దురంధర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ అరబ్ కంట్రీస్ లో కూడా దురంధర్ అనుకున్న టైంకి రిలీజ్ అయ్యుంటే పుష్ప 2కి త్వరగా క్రాస్ చేసే ఛాన్స్ ఉండేది. ఒక భాషకు కట్టుబడటం దురంధర్ స్టామినాని పరిమితం చేసిన మాట వాస్తవం.
ఈ లెక్కన దురంధర్ 2కి కూడా యుఏఈ, కువైట్ తదితర చోట్ల రిలీజయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే దర్శకుడు ఆదిత్య ధార్ పార్ట్ 2ని మరింత పచ్చిగా వయొలెంట్ గా తీశాడనే టాక్ ఉంది. పాకిస్థాన్ మాఫియా తన చేతుల్లోకి వచ్చాక రణ్వీర్ సింగ్ చేసే అరాచకాలు, దమనకాండ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.
సో ఒక్క శాతం కూడా ఛాన్స్ లేనట్టే. లక్ ఏంటంటే దురంధర్ 2 మల్టీ లాంగ్వేజెస్ లో రాబోతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో మార్చి 19 రిలీజ్ చేయబోతున్నారు. బిజినెస్ పరంగా ఇప్పటికీ విపరీతమైన డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్లాక్ బస్టర్ రెండో భాగంలో ఇంకేమేం సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates