ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ నుంచి తాజాగా రిలీజైన ట్రైలర్ తన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఫస్ట్ ట్రైలర్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది కానీ.. ఈ ట్రైలర్ మాత్రం ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాకే తెచ్చుకుంది. మారుతి బలమైన కథే చెప్పబోతున్నాడని.. ఇటు ప్రభాస్, అటు సంజయ్ దత్ క్యారెక్టర్లు క్రేజీగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైంది.
ఇందులో ప్రభాస్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. తన లుక్స్‌లో అందరిలో క్యూరియాసిటి పెంచింది అతను ‘జోకర్’ అవతారంలో ఉన్నదే. హాలీవుడ్ కల్ట్ మూవీ ‘జోకర్’ ఇన్‌స్పిరేషన్‌తో ఈ లుక్‌ను తీర్చిదిద్దినట్లున్నారు. ఈ కథలో ప్రభాస్ అలాంటి లుక్‌లోకి మారాల్సిన అవసరం ఏముంటుంది.. కథతో దీనికున్న కనెక్షన్ ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ జోకర్ లుక్ వెనుక ఇంట్రెస్టింగ్ థియరీ తెరపైకి వచ్చింది.
ప్రభాస్ చివరి చిత్రం ‘కల్కి’ రిలీజైనపుడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన ఓ కామెంట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఆ చిత్రంలో ప్రభాస్ జోకర్‌లా కనిపించాడని అతను విమర్శించాడు. ఐతే అతనన్నది ప్రభాస్‌ను కాదు, క్యారెక్టర్ ను అయినప్పటికీ.. రెబల్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు ‘రాజాసాబ్’లో ప్రభాస్ జోకర్ అవతారం ఎత్తడం, ఏందిరా మీ బాధ అని డైలాగ్ చెప్పడంతో ఇది అర్షద్ వార్సికి కౌంటరే అన్న డిస్కషన్ నడుస్తోంది.
జోకర్ అన్నందుకు అదే లుక్‌లోకి మారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ద్వారా తన ప్రత్యేకతను ప్రభాస్ చాటబోతున్నాడని.. ఈ విషయంలో మారుతి ప్లానింగ్ సూపర్ అని అంటున్నారు ఫ్యాన్స్. ఐతే కొందరు మాత్రం అర్షద్ వార్సి కామెంట్‌కు, ప్రభాస్ ఈ లుక్‌లోకి మారడానికి ఏ సంబంధం లేదని.. ఇది ఎప్పుడో మొదలైన సినిమా కనుక ఆ పోలికలు అనవసరమని అంటున్నారు. ఏదైతేనేం ఈ లుక్ తాలూకు క్లిప్స్ వైరల్ అయి, ఒక చర్చకు దారి తీయడంతో సినిమాకు హైప్ పెరుగుతోందన్నది మాత్రం వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates