తమన్ హర్ట్ అయ్యాడా?

చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఒక సామాన్యుడిలా నెటిజన్లను ఎంగేజ్ చేస్తుంటాడు తమన్. అభిమానులతో తరచుగా సంభాషణలు చేయడం, వారిని ఎంటర్టైన్ చేసేలా పోస్టులు పెట్టడం తన ప్రత్యేకత. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏ స్థాయిలో, సెలబ్రెటీల మీద ఎలాంటి కామెంట్లు చేస్తారో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

అయినా తమన్ ఏం ఫీల్ కాకుండా అభిమానులతో ఎంగేజ్ అవుతుంటాడు. తనను ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. వారిలో రియలైజేషన్ వచ్చేలా పోస్టులు పెడుతుంటాడు. కొన్నిసార్లు బాగా హర్టయితే మాత్రం.. కొంచెం ఘాటుగా స్పందిస్తుంటాడు. నిన్న తమన్ సంగీతం అందించిన ‘రాజాసాబ్’ ట్రైలర్ లాంచ్ అయింది. దానికి మంచి స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్.. ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను షేర్ చేస్తూ టీంలో ముఖ్యమైన అందరి గురించి ప్రస్తావించాడు. ట్రైలర్‌ను కొనియాడాడు. ఐతే తరణ్.. సంగీత దర్శకుడిగా తమన్ పేరు ప్రస్తావించలేదు. దీంతో తమన్ హార్ట్ అయ్యాడని.. ఈ సినిమాకు సంగీతం అందించింది నేనే, నా హ్యాండిల్ ఇదిగో అంటూ తరణ్‌ను కోట్ చేసి పోస్టు పెట్టాడని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

తాను మంచి ఔట్ పుట్ ఇచ్చిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతుండగా.. తన పనిని గుర్తించకపోతే ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కు అయినా బాధ కలుగుతుంది. తరణ్‌కు ఉన్న రీచ్ దృష్ట్యా తన పేరును ప్రస్తావించకపోవడం మరీ హర్టింగ్‌గా అనిపించినట్లుంది తమన్‌కు. ఇదిలా ఉండగా.. ఒక నెటిజన్ ‘రాజాసాబ్’ ట్రైలర్‌కు తమన్ అందించిన సంగీతాన్ని కొనియాడుతూ.. ‘‘ఆ మ్యూజిక్ ఏంట్రా మెంటల్ నా కొడకా’’ అని కామెంట్ చేస్తే.. దానికి తమన్ ‘‘థ్యాంక్స్ రా పిచ్చ నా పకోడా’’ అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం.