ముగ్గురు భామల్లో డామినేషన్ ఎవరిది

రాజా సాబ్ లో నటించిన ముగ్గురు హీరోయిన్లు ఎవరికి వారు తమకు ఇది పెద్ద బ్రేకవుతుందని బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. ముఖ్యంగా హిట్టు కోసం పరితపించిపోతున్న నిధి అగర్వాల్ కు ఈ ఏడాది హరిహర వీరమల్లు పెద్ద షాక్ ఇచ్చింది. ఆది హిట్ అయితే సీక్వెల్ రూపంలో మరోసారి పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ దొరికేది కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.

మాళవిక మోహనన్ కు ఇది టాలీవుడ్ డెబ్యూ కావడంతో ప్రమోషన్లకు బాగా సహకరిస్తోంది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్ట్యూమ్, గ్లామర్ పరంగా ఎక్కువ హైలైట్ అయ్యింది తనే. ఇక లాస్ట్ నాట్ లీస్ట్ రిద్ది కుమార్ ది కూడా ఇదే పరిస్థితి.

స్క్రీన్ స్పేస్ అందరికీ సమానంగా వచ్చేలా దర్శకుడు మారుతీ జాగ్రత్తపడ్డారట. ప్రభాస్ తో ముగ్గురు భామల సాంగ్ ప్లాన్ చేయడం వెనుక కారణం కూడా ఇదే. రాజా సాబ్ జీవితంలో ఒక్కొక్కరు ఒక్కోసారి పరిచయమవుతారు. కానీ ముగ్గురిని తీసుకుని రాజా సాబ్ తాత ఉండే దెయ్యాల మహల్ కు వెళ్తాడు.

అక్కడ జరిగే హారర్ కామెడీతో పాటు గ్లామర్ ఎలిమెంట్స్ కూడా తెలివిగా జొప్పించారట. అవి హైలైట్ అవుతాయని ఇన్ సైడ్ టాక్. ఏదో పాటల కోసమని పెట్టారని కాకుండా ఈ ముగ్గురిలో ఇద్దరికి ఊహించని ట్విస్టు కూడా ఉంటుందని వినికిడి. అది తెరమీద చూస్తే షాక్ అవ్వొచ్చని టీమ్ ఊరిస్తోంది.

వీళ్ళ సంగతి ఎలా ఉన్నా ట్రైలర్ చూశాక ముగ్గురిలో ఎవరు డామినేట్ చేశారంటే సమాధానం, వీళ్ళు కాదు వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అంటున్నారు అభిమానులు. ఇందులో నిజం లేకపోలేదు. మూడు నిమిషాల వీడియోని మొత్తం డార్లింగ్ తో నింపేశాడు మారుతీ.

నిధి, మాళవిక, రిద్ది జస్ట్ అలా తళుక్కున కనిపించి మాయమైపోయారు. జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ పబ్లిసిటీ దాదాపు చివరికి వచ్చేసింది. జనవరి 8 దాకా రకరకాల అప్డేట్స్ ఇవ్వబోతున్నారు కానీ ఇంటర్వ్యూలు కాకుండా బయట ప్రభాస్ కనిపించే వేడుక మరొకటి ఉండకపోవచ్చు. ఫ్యాన్స్ అయితే రిలీజ్ కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు.