Movie News

ఈ ఏడాది అతి పెద్ద ‘హిట్’ ఓజీ కాదు

ఏడాది చివరికి వచ్చేశాం. ఈ సమయంలో ఈ సంవత్సరంలో వచ్చిన సినిమాల మీద సమీక్ష జరుపుకోవడం, ఏది అతి పెద్ద హిట్ అని చర్చించుకోవడం సినీ ప్రియులకు అలవాటే. ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశ కలిగించిన విషయమే. ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున లాంటి పెద్ద హీరోలు లీడ్ రోల్ చేసిన సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ కాకపోవడం నిరాశ కలిగించిన విషయం.

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో ‘వార్-2’ చేసినా అందులో ఆయనది హీరో పాత్ర అని చెప్పలేని పరిస్థితి. రామ్ చరణ్‌‌కు ‘గేమ్ చేంజర్’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో మురిపించినా.. ‘హరిహర వీరమల్లు’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బాలయ్యకు ‘డాకు మహరాజ్’ ఓ మోస్తరు ఫలితాన్నివ్వగా.. ‘అఖండ-2’ నిరాశనే మిగిల్చింది. వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంచనాలకు మించి ఆడింది. నాని సినిమా ‘హిట్-3’ మంచి పలితాన్నే అందుకుంది.

కానీ పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమానే అనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు. ‘ఈటీవీ విన్’ వారి బ్యాకప్‌తో ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. సాయిమార్తాండ్ డైరెక్ట్ చేశాడు.

యూట్యూబర్ మౌళి, అప్ కమింగ్ హీరోయిన్ శివాని నగరం ఇందులో లీడ్ రోల్ చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిన్న సినిమా ఏకంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షేర్ దాదాపు రూ.30 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మూడు వారాల పాటు బాక్సాఫీస్‌ను ఈ సినిమా షేక్ చేసింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటిల పంట పండింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ మంచి లాభాలందుకున్నారు. పేరు సంపాదించారు. కోర్ట్ సహా మరి కొన్ని చిన్న సినిమాలు మంచి ఫలితాలు అందుకున్నాయి ఈ ఏడాది. పెద్ద సినిమాల్లో పవన్ ఓజీ హైయెస్ట్ గ్రాసర్ అయినప్పటికీ, పెట్టుబడి రాబడి కోణంలో లిటిల్ హార్ట్స్ లెక్కలు వేరుగా ఉన్నాయి. అందుకే ‘లిటిల్ హార్ట్ష్’ సాధించిన సక్సెస్ ముందు ఏ చిత్రం నిలవజాలదు. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అదే అనడంలో మరో మాట లేదు.

This post was last modified on December 30, 2025 8:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

1 hour ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

2 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

3 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

4 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

5 hours ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

5 hours ago