ఈ ఏడాది చివరి వీకెండ్లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. క్రిస్మస్ వీకెండ్ కావడంతో పోటీ ఉన్నా పర్వాలేదని ఒకేసారి అన్ని సినిమాలనూ రిలీజ్ చేసేశారు. ఈ చిత్రాలన్నీ చిన్న, మిడ్ రేంజివే. ఐతే ఈ అరడజను సినిమాల్లో దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. డబ్బింగ్ సినిమా అయిన ‘వృషభ’ ఔట్ రైట్ డిజాస్టర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే తేలిపోయింది.
మిగతా అయిదు తెలుగు చిత్రాల్లో ‘శంబాల’ బెటర్ టాక్ తెచ్చుకుని ఆ టాక్‌కు తగ్గట్లే వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. ‘ఛాంపియన్’కు బిలో యావరేజ్ టాక్ రాగా.. వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. రిలీజ్ ముంగిట అస్సలు సౌండ్ చేయని ‘పతంగ్’ అనే చిన్న సినిమాకు మంచి టాకే వచ్చింది. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. మిగతా రెండు చిత్రాల బాక్సాఫీస్ రన్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
శివాజీ ముఖ్య పాత్ర పోషించిన ‘దండోరా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా కులం సమస్య చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ‘దండోరా’ను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే చూసిన వాళ్లంతా మంచి సినిమా అంటున్నా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇలాంటి సినిమా వేరే భాషలో వస్తే మన వాళ్లు ఆహా ఓహా అంటారని, తెలుగులో వస్తే మాత్రం ఆదరించడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంత పోటీ మధ్య రావడం ఈ సినిమాకు చేటు చేసిందని అంటున్నారు. సీరియస్ సినిమా కావడం మైనస్ అయిందనే వాదనా వినిపిస్తోంది. డీసెంట్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాడ్ టాక్, నెగెటివ్ రివ్యూలతో మొదలైన ‘ఈషా’ సినిమాకు మాత్రం అంచనాలకు మించే వసూళ్లు వస్తున్నాయి.
రిలీజ్ డే నుంచి ప్రతి రోజూ కొన్ని షోల వరకు ఈ సినిమాకు ఫుల్స్ పడుతున్నాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలే కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడంతో వీకెండ్ లోపలే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోవడం విశేషం. ఈ రెండు చిత్రాల ఫలితాలు చూసి.. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఎలా ఆదరిస్తారో అర్థం కాదని ఫిలిం మేకర్స్ తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on December 28, 2025 6:19 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు బలమైన హామీ లభించింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ముందుకు వచ్చింది.…
ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం…
కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన మారుతి… ఆ తర్వాత మిడ్ రేంజ్ చిత్రాలకు ఎదిగాడు.…
సినిమాలు సమాజం మీద ఎంతగా ప్రభావం చూపుతాయో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ప్రభావం మంచిగానూ ఉండొచ్చు. అలాగే చెడుగానూ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు నేడు సిట్ విచారణకు హాజరైన సంగతి…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకడైన రజినీకాంత్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ ఆశిస్తాడు. ఒకసారి…