ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హీరోల్లో మోహన్ లాల్ ఒకడు. మలయాళ ఇండస్ట్రీలో నటన పరంగా, బాక్సాఫీస్ రికార్డుల పరంగా ఆయన్ని మించిన హీరో లేడు అంటే అతిశయోక్తి కాదు. మమ్ముట్టి నుంచి దశాబ్దాలుగా గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఆయన కూడా అందుకోలేని పెర్ఫామెన్సులు, రికార్డులతో మోహన్ లాల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
మలయాళ ఇండస్ట్రీకి 50 కోట్లు, 100 కోట్లు, 250 కోట్లు.. ఇలా అనేక క్లబ్బులను పరిచయం చేసిన ఘనత మోహన్ లాల్‌దే. ఈ ఏడాది ‘ఎల్-2: ఎంపురాన్’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సరే.. ఆ మూవీతోనూ ఇండస్ట్రీ హిట్ కొట్టడం లాలెట్టన్‌కే చెందింది. తర్వాత ‘తుడరమ్’తోనూ రికార్డుల మోత మోగించాడు. ఇలాంటి హీరోకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎదురైన అనుభవం చూసి అందరూ షాకైపోతున్నారు.
లాల్ సినిమా అంటే పది కోట్లకు తక్కువ కాకుండా ఓపెనింగ్స్ వస్తోంది చాలా ఏళ్లుగా. ‘ఎంపురాన్’కు అయితే ఇండియాలో రూ.22 కోట్లు, మొత్తంగా రూ.40 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి తొలిరోజు.
అలాంటిది మోహన్ లాల్ కొత్త సినిమా ‘వృషభ’ బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరంగా పెర్ఫామ్ చేస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి కోటి రూపాయల కలెక్షన్ కూడా రాలేదు. కేవలం రూ.65 లక్షలకు పరిమితం అయ్యాయి వసూళ్లు. రెండో రోజు అయితే రూ.32 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసిందీ చిత్రం. మూడో రోజు వీకెండ్ అయినా సరే.. ఇంకా దారుణంగా రూ.20 లక్షలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఇప్పటిదాకా ‘వృషభ’కు ఇండియా వైడ్ వచ్చిన వసూళ్లు కేవలం రూ.1.2 కోట్లు.
‘వృషభ’లో మోహన్ లాల్‌ను హీరో అని చెప్పలేం. పేరుకు ఆయనదే లీడ్ రోల్ కానీ.. సమర్జిత్ లంకేష్ అనే కన్నడ కుర్రాడికే సినిమాలో ఎక్కువ హైప్ ఇచ్చారు. మోహన్ లాల్ అసలెందుకు ఈ సినిమా చేశాడా అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఆయన పాత్ర. లాలెట్టన్ కూడా సినిమాలో చాలా మొక్కుబడిగా నటించాడు. కానీ క్యారెక్టర్ ఎలా ఉన్నా, ఆయనెలా నటించినా.. ఇది మోహన్ లాల్ సినిమాగానే గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి బాక్సాఫీస్ నంబర్లు యాంటీ ఫ్యాన్స్‌కు పెద్ద ఆయుధంలా దొరికాయి. లాల్‌ను వాళ్లు మూడు రోజులుగా మామూలుగా ట్రోల్ చేయట్లేదు.
This post was last modified on December 28, 2025 2:36 pm
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…