క్రిస్మస్ బరిలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం ఇతర నిర్మాతలకు చాలా ప్లస్ అయ్యింది. అన్నీ మీడియం, చిన్న తరహా మూవీస్ పోటీ పడటం వల్ల మంచి ఆప్షన్ కోసం చూస్తున్న ప్రేక్షకులు ఉన్నవాటిలో డీసెంట్ టాక్ ఉన్నవాటి వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ అడ్వాంటేజ్ శంభాల వాడుకుంటోంది. టీమ్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు 3 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు కావడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆది సాయికుమార్ మార్కెట్ కోణంలో చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే. ప్రమోషన్ల ఫలితం, కంటెంట్ బానే ఉందనే పబ్లిక్ టాక్ కలిసి వచ్చి వసూళ్లు తెస్తున్నాయి.
ఛాంపియన్ తో శంభాలని పోల్చడానికి లేదు. రోషన్ మేక మూవీనే ఎక్కువ కలెక్ట్ చేసినప్పటికీ బడ్జెట్, స్కేల్, బ్యానర్ వేల్యూ తదితర అంశాల్లో ఛాంపియన్ చాలా పైన ఉంది. దానికి కూడా టాక్ యునానిమస్ గా రాలేదు. నిజాయితీ ప్రయత్నం, రెగ్యులర్ ఫార్ములా కాకుండా కొత్తగా అనిపించే పీరియాడిక్ డ్రామా లాంటివి ఆడియన్స్ ని ఫుల్ చేస్తున్నాయి.
ఎంతవరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందనేది సోమవారం డ్రాప్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో శంభాలకు రిస్క్ లేదు. బ్రేక్ ఈవెన్, లాభాలు వేగంగా జరిగిపోయేలా ఉన్నాయి. సండే దాకా ఫుల్స్ పెట్టినా చాలు ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతుంది.
మరింత మెరుగైన రిజల్ట్ కోసం శంభాల బృందం మళ్ళీ రంగంలోకి దిగుతోంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. ఆది సాయికుమార్ స్వయంగా థియేటర్లకు వెళ్లి జనాన్ని కలుసుకోబోతున్నాడు. ఈషా కూడా ఓ మోస్తరు ఓకే అనిపించుకున్నట్టుగా బుకింగ్స్ చెబుతున్నాయి కానీ శంభాలని ఓవర్ టేక్ చేసేంత ఛాన్స్ లేదని ట్రేడ్ రిపోర్ట్.
శంభాల ఓటిటి డీల్ పది కోట్లకు చేసుకున్న నేపథ్యంలో నిర్మాతలు ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నారు. శంభాల పుణ్యమాని ఆది సాయికుమార్ మళ్ళీ ట్రాక్ లో వచ్చే సూచనలున్నాయి. త్వరలోనే తన కొత్త మూవీ ఎస్ఐ యుగంధర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బిజినెస్ ఈజీగా జరిగిపోతుంది.
This post was last modified on December 26, 2025 8:44 pm
ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కోట్లు సంపాదించినా, లక్షల అభిమానులను వెనక నిలుపుకున్నా దానికి ప్రధాన కారణం ప్రేక్షకులే.…
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం…
ఇటీవలే విడుదలైన ఛాంపియన్ ద్వారా మలయాళ కుట్టి అనస్వర రాజన్ పరిచయమయ్యింది. రామ్ చరణ్ అంతటి స్టారే ప్రీ రిలీజ్…
ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతూనే ఉన్న దురంధర్ కొందరి జీవితాలను సమూలంగా మార్చేసింది. వాళ్లలో…
మూడేళ్లకు పైగా సమయాన్ని కేవలం ఒక్క సినిమా కోసమే వెచ్చించిన రోషన్ మేకకు ఛాంపియన్ రూపంలో ఫలితం వచ్చేసింది. యునానిమస్…
మాములుగా స్టార్ హీరోలు తమ వయసు ఎంత ఉన్నా చిన్న ఈడు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్స్, డ్యూయెట్స్ కోరుకోవడం సహజం.…