క్రిస్మస్ ఫెస్టివల్ ఇవాళ మినీ సంక్రాంతిని తలపించేసింది. ఏకంగా అరడజనుకు పైగా రిలీజులతో థియేటర్లు కళకళలడాయి. టాక్స్ సంగతి పక్కనపెడితే సెలవు రోజు ఏదోకటి చూద్దామని ఫిక్స్ అయిపోయిన ఆడియన్స్ పొలోమని టికెట్లు కొనేసుకుని వెళ్లిపోయారు. దెబ్బకు అఖండ తాండవం 2, అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ అయ్యాయి.
ఛాంపియన్, శంభాల, ఈషాలకు మంచి ఆక్యుపెన్సీలు కనిపించగా దండోరా ఇంకా పికప్ కావాల్సి ఉంది. వసూళ్ల కన్నా ప్రశంసలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గొడవలో మోహన్ లాల్ వృషభ కూడా ఉంది.
నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా థియేటర్లకు వచ్చిన సంగతే ఆడియన్స్ కి రిజిస్టర్ కానంత వీక్ ప్రమోషన్లు చేసుకుంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పటికీ సరిపడా షోలు, థియేటర్లు దొరకలేదని ట్రేడ్ టాక్. కారణం కనీస బజ్ లేకపోవడమే.
మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేసిన వృషభకు రిపోర్ట్స్ ఏమంత ఆశాజనకంగా లేవు. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ, పాత తరహా కథా కథనాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తోంది. వేసిన ఒకటి రెండు షోలు కూడా కనీస జనాలు లేక క్యాన్సిల్ చేసి వేరే సినిమాలకు ఇచ్చేసిన దాఖాలాలున్నాయని బయ్యర్స్ టాక్.
నిజానికి మోహన్ లాల్ కొంత చొరవ తీసుకుని హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో భాగమై ఉంటే వృషభ కనీసం రిజిస్టర్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ఎల్2 ఎంపురాన్ విషయంలో కనిపించిన శ్రద్ధ వృషభకు మిస్ అయ్యింది. తెలుగు జనాలకు పరిచయమున్న ఆర్టిస్టులు లేకపోవడం, ట్రైలర్ కట్ మాములుగా అనిపించడం లాంటి కారణాలు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించాయి.
కేరళలో బోణీ బాగానే ఉంది కానీ ఏపీ తెలంగాణలో పరిస్థితి అంతంతమాత్రమే. వరస హిట్లతో దూసుకుపోతున్న మోహన్ లాల్ కు ఈ వృషభ స్పీడ్ బ్రేకర్ అవుతుందేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. చూడాలి మరి ఏం చేస్తుందో.
This post was last modified on December 25, 2025 11:29 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…