జనవరి 12 విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు ఆగమనం ఎంతో దూరంలో లేదు. అయితే అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ కాగానే స్పీడ్ పెంచేందుకు వెయిట్ చేస్తున్న ఈ ట్రెండీ డైరెక్టర్ చిరంజీవి – వెంకటేష్ సాంగ్ తో దాన్ని పీక్స్ కు తీసుకెళ్ళబోతున్నారు.
జనవరి 1 నుంచి వీలైనంత మంది ఆర్టిస్టుల డేట్లు తీసుకుని వాళ్ళతో వెరైటీ పబ్లిసిటీ చేయించేందుకు రంగం సిద్ధం చేశారట. ముఖ్యంగా నయనతారతో స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రోమోలు ఉంటాయని ఇన్ సైడ్ టాక్. ఇక రిస్క్ విషయానికి వద్దాం.
రాజా సాబ్ రూటులోనే మన శంకరవరప్రసాద్ గారు ముందు రోజు ప్రీమియర్లకు దాదాపు ఓకే అనుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాకపోతే టికెట్ రేట్ల వ్యవహారం తేలాల్సి ఉంటుంది. ఇకపై స్పెషల్ షోలు, హైక్స్ ఉండవని చెప్పిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజంగా ఆ మాట మీద ఉంటారా లేదానేది రాజా సాబ్ తో తేలిపోతుంది.
ఒకవేళ ప్రభాస్ కు సడలింపు ఇస్తే ఆటోమేటిక్ గా చిరంజీవికి కూడా అప్లై అవుతుంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. కాకపోతే బడ్జెట్, బిజినెస్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో పెంపు విషయంలో కూడా ఆ తేడా చూపిస్తేనే ఆడియన్స్ కన్విన్స్ అవుతారు.
ఈ మధ్య అఖండ తాండవం 2 రిస్క్ తీసుకుని ముందు రోజు ప్రీమియర్లకు వెళ్ళింది. ప్రభుత్వాలు స్పెషల్ రేట్ కూడా ఇచ్చాయి. కానీ దాని వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ అర్ధరాత్రికే మిక్స్డ్ టాక్ రావడం రిజల్ట్ మీద ప్రభావం చూపించింది.
కానీ మన శంకరవరప్రసాద్ గారుకి రావిపూడి అనే బ్రాండ్ ఉంది. దీనికి మించి రెండేళ్ళ గ్యాప్ తర్వాత చిరంజీవి స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే పాయింట్ ఉంది. ఇవి కనక పని చేయగలిగి, కంటెంట్ కనెక్ట్ అయితే వసూళ్ల మోత ఖాయం. దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే ఇంకో పది రోజులు ఆగక తప్పేలా లేదు.
This post was last modified on December 24, 2025 8:00 am
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…