ఈ గురువారం ‘శంబాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆది సాయికుమార్. తన కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం ఇదని అతను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కెరీర్ ఆరంభంలో ప్రేమకావాలి, లవ్లీ, గాలిపటం లాంటి చిత్రాలతో ప్రామిసింగ్‌గానే కనిపించిన ఆది కెరీర్.. ఆ తర్వాత డౌన్ అయిపోయింది. సరైన సినిమాలు చేయక అంతకంతకూ తన పరిధి కుచించుకుపోయింది.
ఒక దశలో ఆది సినిమాలు థియేటర్లలో రిలీజవ్వడమే గగనమైంది. రిలీజైనా ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయాయి చాలా చిత్రాలు. అలాంటి సినిమాల్లో ‘షణ్ముఖ’ కూడా ఒకటి. ఇది మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే అయినా.. దాన్ని సరిగా డీల్ చేయకపోవడం, టేకింగ్ తేలిపోవడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. ఆ చిత్రం అలా తయారవడానికి అసలు కారణమేంటో మా ప్రతినిధికి ఇచ్చిన ఎక్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆది వెల్లడించాడు.
‘‘దర్శకుడు షణ్ముఖ కథ చెప్పినపుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఒక వ్యక్తికి ఆరు ముఖాలుండడం మీద కాన్సెప్ట్‌ను దర్శకుడు బాగానే రాసుకున్నాడు. ఈ కథ విన్నపుడు నేనే కాదు.. హీరోయిన్ అవికా గోర్ కూడా ఎగ్జైట్ అయింది. ఐతే ఈ సినిమా 60 శాతం పూర్తయ్యాక బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది.
ఆ చిత్ర నిర్మాత సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో వేరే నిర్మాతకు అప్పగించాడు. ఆ నిర్మాత దీన్ని నేనే డైరెక్ట్ చేస్తా అని కండిషన్ పెట్టి మిగతా డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చాడు. నాకు అది కరెక్ట్ కాదు అనిపించినా.. వాళ్లు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లడం, మిగతా సినిమా పూర్తి చేయాల్సిన కమిట్మెంట్ ఉండడంతో ఏమీ చేయలేకపోయాను.
సినిమా పూర్తి చేశాను. కానీ చేస్తున్నపుడే ఇది వర్కవుట్ కాదు అనిపించింది. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఆషామాషీ విషయం కాదు. అనుకున్నట్లుగా ఔట్ పుట్ తీసుకురావడం అందరి వల్లా కాదు. ఆ విషయంలోనూ తేడా కొట్టి సినిమా అలా తయారైంది’’ అని ఆది వెల్లడించాడు. తన కొత్త చిత్రం ‘శంబాల’ విషయంలో ఇలాంటి తప్పులేమీ జరగలేదని, ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగా సినిమాను తీర్చిదిద్దామని ఆది తెలిపాడు.
This post was last modified on December 24, 2025 7:37 am
శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించిన పరాశక్తి జనవరి 10 విడుదల…
అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా 'లాటరీ…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మన 'బాహుబలి' రాకెట్ LVM3-M6 శ్రీహరికోట…
లిటిల్ హార్ట్స్... ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో దీన్ని మించిన సెన్సేషన్ లేదు. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్లో…
పుష్ప 2, యానిమల్ ని టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్…
హనుమాన్ వచ్చి రెండేళ్లు దాటుతోంది. ఇప్పటిదాకా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఊసే లేదు. రిషబ్ శెట్టితో జై హనుమాన్…