అఖండ తాండవం 2 ఫలితం తేలినట్టే ఉంది కానీ ఇంకోవైపు తేలనట్టు కూడా అనిపిస్తోంది. కారణం బుకింగ్స్. రెండో వీక్ డే అయిన సోమవారం మాములుగా ఇలాంటి సినిమాల ట్రెండింగ్ చాలా తక్కువగా ఉండి బుక్ మై షో నెంబర్లు కనిపించవు. కానీ అఖండ 2 గత ఇరవై నాలుగు గంటల్లో 14 వేలకు పైగా టికెట్లు అమ్మింది.
బాలయ్య రేంజ్ హీరోకి చిన్న నెంబరే కానీ వచ్చిన టాక్ కోణంలో చూసుకుంటే ఇది చెప్పుకోదగ్గ విశేషమే. నార్త్ లో ఎలాగూ వాషౌట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వస్తున్న వసూళ్లు ఏవైనా సరే తెలుగు రాష్ట్రాల నుంచే తప్ప వేరే చోట కాదు. మరి బాలయ్య పరుగు ఆగినట్టేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
దానికి సమాధానం పూర్తిగా ఆగలేదు. క్రిస్మస్ సెలవు రోజు మళ్ళీ పికప్ చూసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కొత్త రిలీజులు అరడజను ఉన్నాయి కానీ అవన్నీ టాక్ మీద ఆధారపడినవి.
రోషన్ మేక ఛాంపియన్ తో సహా ప్రేక్షకుల తీర్పు కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాయి. శంబాల, దండోరా కూడా బాగానే సౌండ్ చేస్తున్నాయి. అయితే మాస్ ఆడియన్స్ కి ఇవి ఎంత మేరకు ఛాయస్ అవుతాయనేది చెప్పలేం. అందుకే అఖండ 2కి మరో ఎడ్జ్ దొరుకుతుంది. ఆపై వీకెండ్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం నెంబర్లు రాబట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకో మూడు రోజులు ఆగితే న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అది కూడా హాలిడేనే.
అంటే నూతన సంవత్సరం మొదటి రోజు అఖండ 2కి లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. బ్రేక్ ఈవెన్ ఇంకా చాలా దూరంలో ఉన్న నేపథ్యంలో హిట్ ముద్ర పడే ఛాన్స్ అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక సక్సెస్ మీట్ చేయాలని తొలుత అనుకున్నారు కానీ ఆ ఆలోచన మానుకున్నారు.
కర్నూలు వేదికగా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ గెస్టులుగా వేడుక చేస్తే బూస్ట్ వస్తుందనే ప్రతిపాదన తొలుత వచ్చిందట, తక్కువ సమయం ఉండటంతో విరమించుకున్నారని సమాచారం. ఓటిటి స్ట్రీమింగ్ జనవరి తొలి రెండు వారాల్లోనే ఉండొచ్చట. సో ఇంకో రెండు ఛాన్సులు అయితే అఖండ 2 చేతిలో ఉన్నాయి. వాడుకుంటారో లేదో.
Gulte Telugu Telugu Political and Movie News Updates