నిన్న విడుదలైన రౌడీ జనార్ధన టీజర్ మీద రకరకాల స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు విజయ్ దేవరకొండ మాస్ కటవుట్ మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుండగా మరికొందరు నాని ప్యారడైజ్ ని స్ఫూర్తిగా తీసుకోవడం పట్ల దర్శకుడు రవికిరణ్ కోలాని పాయింట్ అవుట్ చేస్తున్నారు.
కేవలం కల్ట్, బోల్డ్ అనిపించుకునేందుకు ల…కొడక అనే పదాన్ని జనరలైజ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. రంగస్థలంలో కూడా ఇలాంటి వాడుక జరిగింది కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనడానికి, ఏకంగా హీరోతోనే ఆ పదం పలికించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఆ తేడా ఏంటో గుర్తించాలి.
ఇక రౌడీ జనార్ధన షూటింగ్ చాలా జరగాల్సి ఉంది కాబట్టి తీసిన ఫుటేజ్ నుంచే ముఖ్యమైన ఎపిసోడ్ లోని సన్నివేశాన్ని ఇలా టీజర్ కోసం వాడుకున్నారు. సో ఇప్పటికిప్పుడు కంటెంట్ మీద ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది.
కాకపోతే కెజిఎఫ్ తరహా డార్క్ వరల్డ్ ని ఆల్రెడీ కింగ్డమ్ లో వాడేసిన విజయ్ దేవరకొండ ఈసారి శ్రీలంక వదిలేసి పాత గోదావరి జిల్లకు వెళ్ళిపోయి కత్తి పట్టి రక్తపాతం చేయబోతున్నాడు. మీసకట్టు, సిక్స్ ప్యాక్ బాడీ అన్నీ మాస్ టచ్ తో ఉన్నాయి. ఇంటికొకడు రౌడీ ఉంటే నా ఇంటి పేరే రౌడీ అంటూ చెప్పించిన డైలాగు అభిమానులకు వేగంగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
సినిమా విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉంది కనక టెన్షన్ అక్కర్లేదు. రౌడీ జనార్ధనలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ కు కూడా పెర్ఫార్మన్స్ పరంగా చాలా స్కోప్ ఉంటుందట. బడ్జెట్ పరంగా పెద్ద రిస్క్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు అవుట్ ఫుట్ మీద చాలా ధీమాగా ఉన్నారు.
లేకపోతే సంవత్సరం ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టడం చిన్న విషయం కాదు. తమ కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడంతో ఈసారి ఖచ్చితంగా హిట్టు కొట్టాలనే లక్ష్యంతో రౌడీ జనార్ధనను లాక్ చేశారు. రవికిరణ్ కోలా తాను అనుకున్నది సాధిస్తే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. దేవరకొండకు సక్సెస్ ఇచ్చిన క్రెడిట్ కూడా దక్కుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates