ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా నిలుస్తుంది ‘దృశ్యం’. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతు జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం ఆ భాషలో రికార్డ్ బ్రేకింగ్ హిట్‌గా నిలిచి.. తర్వాత వివిధ భాషల్లో రీమేక్ అయింది. ప్రతిచోటా మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ చిత్రాన్ని చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో కూడా రీమేక్ చేయడం విశేషం.
‘దృశ్యం’కు కొనసాగింపుగా వచ్చిన ఫస్ట్ సీక్వెల్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. రీచ్, వసూళ్ల పరంగా చూస్తే హిందీ వెర్షన్ దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసింది. అక్కడ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తే.. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో గత ఏడాదే ‘దృశ్యం-3’ని అనౌన్స్ చేశారు మోహన్ లాల్, జీతు జోసెఫ్. ఐతే అక్కడ ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే హిందీ వెర్షన్‌ను మొదలుపెట్టాలనుకున్నారు.
కానీ జీతు అండ్ టీం అందుకు అభ్యంతరం చెప్పింది. ముందుగా మలయాళ వెర్షనే రావాలంది. అందుకే హిందీ ‘దృశ్యం-3’ టీం షూటింగ్‌ను వాయిదా వేసుకుంది. రిలీజ్ డేట్ కూడా వెనక్కి జరిపింది. తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న ‘దృశ్యం-3’ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ టీజర్ లాంచ్ చేసింది. సొసైటీ తనకు ఎన్నో పేర్లు ఇచ్చిందని.. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని.. ఫ్యామిలీ కోసం తాను ఎంత దూరం అయినా వెళ్తానని అజయ్ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ సాగింది. ఈసారి ‘దృశ్యం’ కథను ముగించబోతున్నట్లు ఇందులో సంకేతాలు ఇచ్చింది చిత్ర బృందం.
హిందీలో అజయ్ సరసన శ్రియ మరోసారి నటిస్తుండగా.. లేడీ పోలీసాఫీసర్ పాత్రలో టబు కనిపించనుంది. మరోవైపు మలయాళ వెర్షన్ షూట్ ఆల్రెడీ పూర్తయింది. ఆ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేసే అవకాశముంది. మరోవైపు జీతు జోసెఫ్ వెంకటేష్ హీరోగా తెలుగు వెర్షన్‌ను కూడా చకచకా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఆ చిత్రం హిందీ దసరా కానుకగా రిలీజయ్యే అవకాశాలున్నాయి. మరి త్రివిక్రంతో చేస్తున్న ఆదర్శ కుటుంబంతో పాటు దృశ్యం 3 కూడా చక చకా పూర్తి చేస్తారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates