క్రిస్మస్ కు విడుదల కాబోతున్న సినిమాల్లో వృషభని గీత ఆర్ట్స్ పంపిణీ చేయడంతో మీడియా వర్గాల్లో దీని మీద అటెన్షన్ వచ్చేసింది. టైం తక్కువగా ఉండటం వల్ల ప్రమోషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నా, బొమ్మ ఖచ్చితంగా మెప్పిస్తుందనే ధీమా నిర్మాతల్లో కనిపిస్తోంది. అయితే తెలుగులో కంటెంట్ నే నమ్ముకుని వస్తున్న చిన్న సినిమాలు అయిదారు వస్తున్నప్పుడు దీన్ని ఎందుకు తెచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బన్నీ వాస్ సమాధానం చెబుతూ ఇది డైరెక్ట్ తెలుగు మూవీగానే సర్టిఫికెట్ వచ్చిందని, బై లింగ్వల్ తరహాలో తీశారని వివరణ ఇచ్చారు. పైగా రెండు నెలలు ఆలస్యం అయ్యిందని చెప్పుకొచ్చారు.
సరే అది స్ట్రెయిటా డబ్బింగా అనే డిబేట్ పక్కనపెడితే వృషభని తెలుగు ఆడియన్స్ అనువాద కోణంలోనే చూస్తారనేది వాస్తవం. ఎందుకంటే దీంట్లో టాలీవుడ్ ఆర్టిస్టులు పెద్దగా లేరు. వాస్తవానికి షూటింగ్ మొదలుపెట్టినప్పుడు మోహన్ లాల్ కొడుకు పాత్రకు రోషన్ మేకను తీసుకున్నారు. కానీ ఎందుకనో ఆ కుర్రాడు తర్వాత తప్పుకున్నాడు. ఒకవేళ ఉండి ఉంటే క్యాలికులేషన్ ఎలా ఉండేదో కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. మోహన్ లాల్ మలయాళం సినిమాల్లో మన్యం పులి లాంటి ఒకటి రెండు తప్ప మిగిలినవి పెద్దగా ఆడలేదు. ఎల్2 ఎంపురాన్ కూడా ఇక్కడ సోసోగానే ఆడింది.
సో వృషభ కనక క్లిక్ అయితే మంచి వసూళ్లే దక్కుతాయి. అఖండ 2 యావరేజ్ ఫలితం వల్ల బాక్సాఫీస్ వద్ద ఆశించిన జోష్ లేదు. అందుకే ఛాంపియన్, ఈషా, శంభాల తదితర సినిమాలు పోటాపోటీగా ప్రమోషన్లు చేసుకుంటున్నాయి. పబ్లిసిటీ కోణంలో చూసుకుంటే వృషభ వెనుకబడి ఉంది కానీ ఇందులో విజువల్ గ్రాండియర్ నెస్ కి, భారీ ఖర్చుకి మిగిలినవి సాటి రావన్నది కూడా ఒప్పుకోవాలి. వృషభ హిట్ అయితే మోహన్ లాల్ కి మరో మార్కెట్ మన దగ్గర ఓపెన్ అవుతుంది. నిర్మాతలు కోరుకుంటున్నది కూడా అదే. ఓపెనింగ్స్ ఏమో కానీ టాక్ బాగుంటే మాత్రం జనాన్ని ఈవెనింగ్ షో నుంచే రప్పించొచ్చు.
This post was last modified on December 23, 2025 7:38 am
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…