కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను ఇంచుమించు ఒకే సమస్య వేధిస్తోంది. కరుప్పు విడుదల ఎప్పుడో అర్థం కాక సూర్య ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఏకంగా వాళ్లే స్వంతంగా పోస్టర్లు తయారు చేసుకుని సంక్రాంతికి రిలీజ్ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాయర్, దేవుడిగా రెండు క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయనే టాక్ ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు తప్ప ఫలానా డేట్ అని ఖచ్చితంగా చెప్పడం లేదు. జనవరి నెలాఖరు అంటున్నా దానికీ గ్యారెంటీ లేదు.
ఇంకోవైపు కార్తీ వా వతియర్ (అన్నగారు వస్తారు) ఆర్థిక చిక్కులో పడి కోర్టు వేసిన మొట్టికాయ వల్ల ఆగిపోయింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా కనీసం ఇరవై కోట్లు సిద్ధం చేసుకోనిదే వ్యవహారం తేలేలా లేదు. డిసెంబర్ 5 రిలీజవుతుందని టీమ్ ప్రమోషన్లు చేసింది. కార్తీ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్లు కూడా అమ్మారు. మరికొన్ని గంటల్లో షోలు అనగా అఖండ 2 తరహాలో చివరి నిమిషం బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 2026 వేసవి కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదని చెన్నై టాక్. ఈ పరిణామాల పట్ల తీవ్ర అసహనంగా ఉన్న కార్తీ ఏమి చేయలేని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
సూర్య బ్రదర్స్ కు సక్సెస్ చాలా అవసరం. ఇద్దరూ వరస ఫ్లాపుల్లో ఉన్నారు. మార్కెట్ తగ్గిపోయింది. బయటికి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా నిర్మాతల ఆర్థిక సమస్యలు వీళ్లకు ఇబ్బందిగా పరిణమించాయి. సితార సంస్థ నిర్మిస్తున్న సూర్య కొత్త సినిమా ఆల్రెడీ అయిపోయింది. ఇటీవల గుమ్మడికాయ కొట్టేశారు. దీన్ని సమ్మర్ లో విడుదల చేయాలని ఆలోచన. ఇంకోవైపు కార్తీ సర్దార్ 2 ఆగి ఆగి సాగుతోంది. మొన్న దీపావళికే రిలీజ్ అన్నారు కానీ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. ఈ సమస్యల నుంచి బయట పడి ఎపుడు ఇవన్నీ మోక్షం దక్కించుకుంటాయో కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on December 22, 2025 2:25 pm
ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది…
బిగ్ బాస్ షో ద్వారా.. ఆ తర్వాత కోర్టు మూవీలో విలన్ పాత్ర ద్వారా మళ్ళీ మంచి పాపులారిటీ సంపాదించి…
వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు,…
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈసారి రౌడీ జనార్ధనగా రాబోతున్నాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జనాలు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.…