బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో దేశవ్యాప్తంగా ప్రేక్షుకులను మరోసారి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు మణిరత్నం. పేరుకు అది సౌత్ మూవీనే కానీ.. పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అయింది. ఆ చిత్రంలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే.
ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే.. మణిరత్నం ఇంకా అద్భుతంగా వాటిని చిత్రీకరించారు. ఆ పాటల్లో ‘ఉయిరే ఉయిరే’ (తెలుగులో ఉరికే చిలకా) చాలా స్పెషల్. సముద్రపు ఒడ్డున అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో హృదయానికి హత్తుకునేలా మణిరత్నం ఆ పాటను చిత్రీకరించగా.. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా చక్కటి హావభావాలతో ఆ పాట ఫీల్‌ను ఇంకా పెంచారు.
ఈ పాటకు అంత అందం రావడంలో లొకేషన్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సాంగ్ తీసింది కేరళలోని కాసర్‌గడ్ సమీపంలో ఉన్న బెకాల్ బీచ్‌లో. అక్కడ ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆ వేడుకకు ‘బొంబాయి’ టీం హాజరైంది. దర్శకుడు మణిరత్నం, హీరోయిన్ మనీషా కొయిరాలా, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ఈ వేడుకకు హాజరైన సందర్భంగా ‘ఉయిరే ఉయిరే’ పాట తీసిన లొకేషన్‌కు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆ ముగ్గురూ నోస్టాల్జిగ్గా ఫీలయ్యారు. ఎమోషనల్ అయ్యారు. ‘బొంబాయి’ సినిమాకు ఉయిరే ఉయిరే పాట ప్రాణం పోసిందని.. బెకాల్‌లో తీయడం వల్లే ఆ పాటకు అంత అందం వచ్చిందని మణిరత్నం తెలిపాడు. ఆ లొకేషన్ చూడగానే పాటకు అవసరమైన మూడ్ వచ్చేసిందని ఆయన చెప్పారు.
ఇక్కడ షూటింగ్ చేసిన అనుభవాలను మనీషా కూడా గుర్తు చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం గొప్పగా అనిపిస్తోందని.. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అందంగా మెయింటైన్ చేస్తుండడం గొప్ప విషయమని రాజీవ్ మీనన్ తెలిపాడు. ‘ఉయిరే ఉయిరే’ పాటతో ఈ లొకేషన్‌కు ఎనలేని గుర్తింపు వచ్చి.. ఇదొక ఐకానిక్ మాన్యుమెంట్‌గా మారిందని నిర్వాహకులు తెలిపారు.
This post was last modified on December 21, 2025 4:51 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…