నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నాక చేయి జారినా వైజయంతి బ్యానర్ తో తన రెండో అడుగును వేస్తున్నాడు. స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తున్న ఛాంపియన్ డిసెంబర్ 25 విడుదల కానుంది. ఇవాళ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇప్పటిదాకా దీని కథేంటో లీక్స్ కాకుండా టీమ్ జాగ్రత్త పడింది. అందుకే పెద్దగా అవి బయటికి రాలేదు. ఈ రోజు వాటికి చెక్ పెట్టారు. స్టోరీ, బ్యాక్ డ్రాప్ మొత్తం అరటిపండు వలిచినట్టు చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం.
1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చాక తెలంగాణలో ఉండే భైరాన్ పల్లి ఇంకా రజాకార్ల చేతుల్లోనే ఉంటుంది. అరాచకం రాజ్యమేలే ఆ ఊరిలో నోరెత్తిన వాడికి మరణమే శిక్ష. అలాంటి చోట ఒక కుర్రాడు (రోషన్ మేక) ఫుట్ బాల్ అట ద్వారా విదేశాలకు వెళ్లే లక్ష్యంతో ఉంటాడు. అయితే తాను పుట్టి పెరిగిన చోట జరుగుతున్న దారుణాలు అతన్ని కదలనివ్వవు. నాటకాలు వేసుకునే అమ్మాయి (అనస్వర రాజన్) ని ప్రేమించిన ఈ అబ్బాయి మైదానంలో కాకుండా యుద్ధభూమిలో అడుగు పెట్టే పరిస్థితి వస్తుంది. అసలు బ్రిటిషర్లు వెళ్ళిపోయాక కూడా అక్కడెందుకు ఘోరాలు జరిగాయనేది తెరమీద చూడాలి.
ఊహించని స్థాయిలో విజువల్స్ సర్ప్రైజ్ చేశాయని చెప్పాలి. నిర్మాతలు అశ్వినిదత్, ప్రియాంక, స్వప్నల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రొడక్షన్ వేల్యూస్ తోనే ఆసక్తి పెంచారు. రోషన్ మేకకు ఛాంపియన్ పెద్ద ప్రమోషన్ కానుంది. కంటెంట్ కనక క్లిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ రెండో సినిమాకే దొరకడం అదృష్టం. మిక్కీ జె మేయర్ సంగీతం, ఆర్ట్ వర్క్. కెమెరా నైపుణ్యం ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అంచనాలు పెంచడంలో ఛాంపియన్ టీమ్ సక్సెసయ్యింది.
This post was last modified on December 18, 2025 10:29 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…