Movie News

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే కాదు.. మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోల నుంచి కూడా తరచుగా సినిమాలు ఆశిస్తారు ప్రేక్షకులు. గత దశాబ్ద కాలంలో టాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరో కమ్ రైటర్‌గా పేరు సంపాదించిన అడివి శేష్ సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం పట్ల ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. 

2022లో మేజర్, హిట్-2 చిత్రాలతో పలకరించిన అతను.. తర్వాతి సినిమాకు ఏకంగా మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నాడు. వచ్చే ఏడాది అతను ముందుగా మార్చి 19న ‘డెకాయిట్’ మూవీతో రాబోతున్నాడు. 2026 ద్వితీయార్దంలో ‘జీ 2’ వచ్చే అవకాశముంది. ఐతే మరీ ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్టా, ఏడాదికో సినిమా చేయాలనే డిమాండ్ సంగతేంటి అని ‘డెకాయిట్’ టీజర్ లాంచ్‌లో అడిగితే.. సమాధానం చెప్పాడు శేష్.

‘‘నేను సొంతంగా కథ రాసే సినిమా చేస్తూ.. బయటి వాళ్లతో ఇంకో సినిమా చేసేవాడిని. ‘మేజర్’ నా సినిమా అయితే, ‘హిట్-2’ బయటి సినిమా. అవి రెండూ ఒకే సంవత్సరం రిలీజయ్యాయి. కానీ ఆ తర్వాత రెండు సినిమాలకూ రైటింగ్‌లో భాగమయ్యాను. అవే డెకాయిట్, జీ-2. ఇలా ఒకేసారి రెండు సొంత కథలతో సినిమాలు చేయడం తప్పయింది. 2022లో మేజర్, హిట్-2 సినిమాలు చేశాక నేను పూర్తి అలసిపోయాను. ‘మేజర్’ సినిమా కోసం 21 నగరాల్లో ప్రమోషన్లు చేశాను. 

ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని సొంతంగా రెండు సినిమాలకు స్క్రిప్టు రాయడం మొదలుపెట్టాను. కేవలం రాయడం మాత్రమే కాదు, ప్రిపరేషన్ కూడా ఉంటుంది. దీనికి ఏడాదిన్నర సమయం పట్టింది. తర్వాత ఈ రెండు సినిమాల షూట్ మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఏడాదిన్నర సమయం పడుతోంది. అలా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. శేష్ సినిమా అంటే కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడాలి అంటున్నారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. 

ఇప్పుడు మనీ హైస్ట్, స్క్విడ్ గేమ్ లాంటి ఇంటర్నేషనల్ సిరీస్‌లను తెలుగు ఆడియో పెట్టుకుని చూసేస్తున్నారు. అలాంటపుడు వాటిని మ్యాచ్ చేసేలా, వాటిని మించి కంటెంట్ ఉండాలంటే ఎంత కష్టపడాలి? తెలుగు సినిమా అంటే ఇదీ అని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయాలన్నది మా ప్రయత్నం. మేం ఐఫోన్ డెవలపర్లం. ప్రేక్షకులు ఐఫోన్ యూజర్లు. వాళ్లకు నచ్చే ఔట్ పుట్ ఇవ్వాలంటే టైం తీసుకోవాలి. కష్టపడాలి’’ అని శేష్ అన్నాడు.

This post was last modified on December 18, 2025 10:03 pm

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

1 hour ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

6 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

6 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

8 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

10 hours ago