బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్ ఖాన్ సహా చాలామంది సెలబ్రెటీలు ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తూనే ఉన్నారు. కానీ వారి అభిమానులకు మాత్రం ఇలాంటివి చూసినపుడు ఏదోలా ఉంటుంది. దేశంలో అంత పెద్ద స్టార్లు అయి ఉండి.. ఇలా ప్రైవేట్ వెడ్డింగ్స్‌లో డ్యాన్సులు చేయడమేంటి అనిపిస్తూ ఉంటుంది.
తమకు సన్నిహితులైన వారి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేసినా ఒక అర్థం ఉంది కానీ.. తమ ఇమేజ్ చూసుకోకుండా కేవలం డబ్బు కోసం ఇలా ఈవెంట్లకు వెళ్లి నృత్యాలు చేయడం ఏంటి అని అభిమానులే ప్రశ్నిస్తుంటారు. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో షారుఖ్ ఇలా డ్యాన్స్ చేయడం.. తనతో కలిసి నృత్యం చేయడానికి పెళ్లి కూతురు అంగీకరించకపోయినా షారుఖ్ ఆమెను బతిమలాడుతున్నట్లు కనిపించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.
ఈ నేపథ్యంలో షారుఖ్ మారతాడో లేదో కానీ.. మరో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఇకపై ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. గతంలో సైఫ్ సైతం మిగతా స్టార్లలాగే ప్రైవేట్ వెడ్డింగ్స్‌కు వెళ్లి డ్యాన్సులు చేసిన వాడే. కానీ ఇకపై తాను అలా చేయనంటున్నాడు సైఫ్.
‘‘కెరీర్ ఆరంభంలో వివాహ వేడుకలకు వెళ్లి సరదాగా ఆడి పాడేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా చేయడం నాకు అసౌకర్యంగా అనిపిస్తోంది. వేరే వాళ్ల పెళ్లిళ్లలో మనం డ్యాన్సులు చేస్తే మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు’’ అని కుండబద్దలు కొట్టాడు సైఫ్. మరి ఈ సీనియర్ హీరో నిర్ణయం మిగతా వారిలో కూడా మార్పు తెస్తుందేమో చూడాలి. షారుఖ్ మాత్రమే కాదు.. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్లు సైతం పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేసిన వాళ్లే. అందరిలోకి షారుఖ్‌నే ఎక్కువగా ఇలాంటి ఈవెంట్లలో చూస్తుంటాం.
This post was last modified on December 18, 2025 2:43 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…