అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో చిన్న క్యామియో చేశాడు కానీ అభిమానులకు అది సరిపోలేదు. అందుకే డెకాయిట్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాకు షానియోల్ డియో దర్శకత్వం వహించారు. సంక్రాంతికి వస్తున్నాం నుంచి ఫామ్ లోకి వచ్చిన భీమ్స్ సిసిరోలియో సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ముందు హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకుని ఆ తర్వాత తన స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ టీజర్ వదిలారు. కాన్సెప్ట్ చెప్పీ చెప్పకుండా రివీల్ చేశారు.
అనగనకా ఒక దొంగ (అడివి శేష్). దోపిడీలు చేసి జైలుకు వెళ్లడం తనకు మాములు విషయం. ఒక ప్రమాదకరమైన మిషన్ అతని చేతికి వస్తుంది. ఒప్పుకుంటాడు. కాకపోతే ఒక అమ్మాయి (మృణాల్ ఠాకూర్) తో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. శత్రువుల నుంచి తప్పించుకుంటూ, ముప్పులను ఎదురుకుంటున్న ఈ జంటను ఒకవైపు మాఫియా, మరోవైపు పోలీసులు వెంటపడుతూ ఉంటారు. ఇంతకీ డెకాయిట్ ఒప్పుకున్న పనేంటి, ప్రియురాలితో ఇతనికున్న లవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. బాగా మాస్ టచ్ ఉన్న పాత్రలో శేష్ కొత్తగా కనిపిస్తున్నాడు.
నాగార్జున హలో బ్రదర్ లోని చార్ట్ బస్టర్ సాంగ్ కన్నెపిట్టరో కన్నుకొట్టరో పాటని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో రీమిక్స్ చేసి వాడటం డిఫరెంట్ గా అనిపించింది. షానియోల్ డియో టేకింగ్ కొంచెం లోకేష్ కనగరాజ్ ని గుర్తు చేసేలా సాగింది. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ మరో రెండు ముఖ్యమైన పాత్రలు పోషించారు. అడివి శేష్, మృణాల్ జోడి రెగ్యులర్ గా చూసే లవర్ పెయిర్ లాగా కాకుండా వినూత్నంగా ప్రెజెంట్ చేయడం బాగుంది. మొత్తానికి అంచనాలు రేపడంలో డెకాయిట్ సక్సెస్ అయినట్టే. వచ్చే ఏడాది మార్చ్ 19 విడుదల కానున్న ఈ సినిమాకు పోటీగా అదే రోజు దురంధర్ 2 షెడ్యూల్ చేయడం గమనార్హం.
This post was last modified on December 18, 2025 12:24 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…