అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి ఉండేవి. కానీ బాలయ్య సినిమా 12కు వచ్చి పడడంతో ఆ డేట్‌కు షెడ్యూల్ అయిన చాలా సినిమాలను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘మోగ్లీ’ సినిమాను ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ చేసేశారు కానీ.. ఆ వారానికి షెడ్యూల్ అయిన మిగతా చిత్రాలన్నీ కొత్త డేట్ వెతుక్కోక తప్పలేదు.
వాటిలో కొన్ని సినిమాలు క్రిస్మస్‌ను టార్గెట్ చేశాయి. కానీ అప్పటికే ఆ సీజన్‌కు కొన్ని సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. దీంతో క్రిస్మస్‌లో మ్యాడ్ రష్ చూడబోతున్నాం. పెద్ద సినిమాలేవీ పోటీలో లేకపోవడంతో మిడ్ రేంజ్, చిన్న సినిమాల జాతర చూడబోతున్నాం ఆ పండక్కి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక చిత్రం ‘ఛాంపియన్’తో పాటు.. ఆది సాయికుమార్ మూవీ ‘శంబాల’ చాలా ముందుగానే క్రిస్మస్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఇవి యథాప్రకారం రాబోతున్నాయి. వీటికి ఇంకో నాలుగైదు చిత్రాలు ఇప్పుడు తోడవుతున్నాయి. 12న రావాల్సిన హార్రర్ మూవీ ‘ఈషా’ను 25కే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ డేట్‌న రావాల్సిన మరో చిత్రం ‘అన్నగారు వస్తారు’ కూడా క్రిస్మస్ సీజన్‌నే టార్గెట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. శివాజీ ప్రధాన పాత్ర పోషించిన ‘దండోరా’ అనే సినిమాను కూడా క్రిస్మస్‌కే తీసుకురాబోతున్నారు.
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తన కొత్త చిత్రం ‘మార్క్’ను క్రిస్మస్ బరిలో నిలిపాడు. అది తెలుగులో కూడా రిలీజ్ కానుంది. మోహన్ లాల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం వృషభ కూడా ఆ సీజన్ కే రానుంది. పంపిణీ చేసేది గీత ఆర్ట్స్ కాబట్టి మంచి రిలీజ్ దక్కుతుందని వినికిడి. పతంగ్, వానర అనే చిన్న సినిమాలు కూడా క్రిస్మస్ సీజన్ డేట్లను ఎంచుకున్నాయి. ఇలా మొత్తంగా ఎనిమిది సినిమాల దాకా చివరి వారంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటిలో ఏదీ పెద్ద సినిమా కాదు కాబట్టి థియేటర్ల సమస్య ఉండకపోవచ్చు. కానీ ఈ పోటీలో ఏది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి విజయం సాధించగలదన్నదే ప్రశ్నార్థకం.
Gulte Telugu Telugu Political and Movie News Updates