డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం చూస్తున్నాం. డిసెంబరు 5న రావాల్సిన ‘అఖండ-2’ వాయిదా పడి వారం ఆలస్యంగా వచ్చింది. 18న రావాల్సిన ‘ఎల్ఐకే’ సినిమా ఫిబ్రవరికి వెళ్లిపోయింది. ఇక 12న రిలీజ్‌కు రెడీ అయిన కార్తి సినిమా ‘వా వాత్తియార్’ (తెలుగులో అన్నగారు వస్తారు).. అఖండ-2 తరహాలోనే చివరి నిమిషంలో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
ఐతే అఖండ-2 నిర్మాతల్లా ‘అన్నగారు వస్తారు’ ప్రొడ్యూసర్ హడావుడి పడలేదు. ఫైనాన్స్ సమస్యను వెంటనే సెటిల్ చేయలేకపోయాడు. కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి మేకర్స్ నుంచి ఇప్పటిదాకా ఏ ప్రకటనా రాలేదు. ఐతే కోలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కార్తి సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఖరారైనట్లే తెలుస్తోంది.
అనుకున్న తేదీ కంటే రెండు వారాలు ఆలస్యంగా ‘వా వాత్తియార్’ను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని క్రిస్మస్ రేసులో నిలబెట్టబోతున్నారు. డిసెంబరు 25న క్రిస్మస్ కాగా.. ముందు రోజే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. సుదీర్ఘ కాలంగా ఉన్న ఫైనాన్స్ వివాదానికి సంబంధించి సూర్య, కార్తిల కజిన్.. నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.21 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. కోర్టు బయటే ఈ గొడవను సెటిల్ చేసుకున్న జ్ఞానవేల్.. సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.
డిసెంబరు 24న సినిమా ‘వా వాత్తియార్’ వస్తుందని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చాడట జ్ఞానవేల్. ‘సూదుకవ్వుం’ ఫేమ్ నలన్ కుమారస్వామి రూపొందించిన ఈ చిత్రంలో కార్తి సరసన కృతి శెట్టి నటించింది. కృతి ఇంకో రెండు తమిళ చిత్రాల్లో నటించగా.. ఇప్పటిదాకా కోలీవుడ్లో తన సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. ‘ఎల్ఐకే’, ‘జీనీ’ చిత్రాలు కూడా వెనక్కి వెళ్లిపోగా.. ‘వా వాత్తియార్’ అయినా రిలీజైతే ఈ ఏడాది ఆమె డెబ్యూను చూడొచ్చు.
This post was last modified on December 16, 2025 3:50 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…