శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు. కేవలం A టైటిల్ తో సెన్సేషన్ సృష్టించడం ఆయనకే చెల్లింది. తెలుగులో అప్పుడప్పుడు కనిపించే ఈ విలక్షణ నటుడు ఈ మధ్యే ఆంధ్రకింగ్ తాలూకాలో ఫుల్ లెన్త్ రోల్ చేశారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేక హీరో రామ్ కి మరో ఫ్లాప్ ఇచ్చింది. ఇక శివరాజ్ కుమార్ గురించి తెలిసిందే. కేవలం మ్యానరిజంస్ తో రజినీకాంత్ జైలర్ ద్వారా ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. వీళ్లిద్దరి కలయికలో ఒక ప్యాన్ ఇండియా మూవీ వస్తోందంటే ఫ్యాన్స్ లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి.
కాకపోతే ఈసారి ఈ కాంబోని హ్యాండిల్ చేస్తున్న దర్శకుడు అర్జున్ జన్యా కూడా ఉపేంద్ర స్టయిల్ లోనే ఆలోచించడం ఆసక్తి రేపుతోంది. తెలుగులో జనవరి ఒకటి విడుదల కాబోతున్న 45 అనే మూవీ ట్రైలర్ చూస్తే రకరకాల కన్ఫ్యూజన్ లు రావడం ఖాయం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను చూపెడుతూ అర్థం కానీ క్యారెక్టరైజేషన్లతో ఏదో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న ఫీలింగ్ అయితే కలిగించారు. ఉపేంద్ర ఎప్పటిలాగే తన టైమింగ్ తో చెడుగుడు ఆడగా, శివరాజ్ కుమార్ తొలిసారి ఆడవేషంలో దర్శనమివ్వడం సర్ప్రైజ్ ప్యాకేజ్. వీళ్లతో పాటు రాజ్ బి శెట్టి కూడా తోడవ్వడం మూవీ లవర్స్ లో హైప్ పెంచుతోంది.
కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే కానీ ఇలాంటి ప్రయోగాలు ఏ మాత్రం బెడిసి కొట్టినా ప్రేక్షకులు మొహమాటం లేకుండా తిరస్కరిస్తారు. కాకపోతే కన్విన్సింగ్ గా ఉండాలి. విజువల్ ఎఫెక్ట్స్ లో ఏఐ ఎక్కువగా వాడిన దాఖలాలు కనిపించాయి. ఒకరకంగా చెప్పాలంటే శివన్న, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి అనే మూడు పవర్ హౌసెస్ తొలిసారి స్క్రీన్ మీద సందడి చేయడం ఖచ్చితంగా అంచనాలు రేపేదే. కన్నడ పరిశ్రమను, శివరాజ్ కుమార్ కెరీర్ ని కొత్త మలుపు తిప్పిన ఓంకి దర్శకత్వం వహించింది ఉపేంద్రనే. ఇప్పుడు హీరోలుగా వేరొకరి డైరెక్షన్లో మల్టీస్టారర్ చేయడం సంథింగ్ స్పెషల్ అనిపిస్తోంది.
This post was last modified on December 16, 2025 11:48 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…