దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్ కూడా ఏపీ తెలంగాణలో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. థియేటర్లు తక్కువ అందుబాటులో ఉండటంతో బయ్యర్లు షాక్ అయ్యేలా మెయిన్ సెంటర్స్ లో టికెట్ ముక్క మిగల్లేదు. ఇక్కడే ఇలా ఉంటే ఉత్తరాదిలో పరిస్థితిని వివరించనక్కర్లేదు. ముంబైలో పదో రోజు అర్ధరాత్రి షోలు వేయడం ప్యూర్ మ్యాడ్ నెస్ అని చెప్పాలి. సోషల్ మీడియా సపోర్ట్ చాలా బలంగా ఉండటంతో వసూళ్లు అంతకంతా పెరుగుతున్నాయి తప్పించి తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ప్రస్తుతం నాలుగు ఐదు కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతున్న దురంధర్ ఈజీగా వెయ్యి కోట్లను చేరుకుంటుందని బాలీవుడ్ హ్యాండిల్స్ కొన్ని అంచనా వేస్తున్నాయి. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే యానిమల్ అంత అరివీరభయంకరంగా ఆడితే తొమ్మిది వందల కోట్లు దాటగానే ఆగిపోయింది. ఫేక్ నెంబర్లు వద్దనుకున్న టి సిరీస్, సందీప్ రెడ్డి వంగాలు ఒరిజినల్ అంకెలకే కట్టుబడ్డారు. ఇప్పుడు దురంధర్ కు కూడా ఆ స్థాయి స్పందనే ఉంది కానీ టార్గెట్ 50 శాతం ఉంది కాబట్టి దాన్ని అందుకోవాలంటే ఇదే దూకుడు ఇంకో రెండు మూడు వారాలు కొనసాగించాల్సి ఉంటుంది.
అయినా సరే ఇది టఫ్ టాస్క్ అనే చెప్పాలి. రిలీజ్ కు ముందు సైలెంట్ కిల్లర్ గా వచ్చిన దురంధర్ రివ్యూల విషయంలో మీడియాని రెండుగా చీల్చేసింది. ముంబై వర్గాల్లో ఇది రోజుకో చర్చ పెడుతోంది. హిందీ న్యూస్ ఛానల్స్ డైలీ కనీసం ఒక గంట దీనికే కేటాయించి వారం రోజులు పండగ చేసుకున్నాయి. త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు దాన్నుంచి ఎంత రాబడతారనేది చూడాలి. గతంలో చావా కూడా ఇదే తరహాలో ఆలస్యంగా డబ్బింగ్ చేసుకుని ఆశించిన ఫలితం అందుకోలేదు. దురంధర్ ఎక్కువ లేట్ చేయకుండా వీలైనంత త్వరగా ప్రాంతీయ భాషల్లో రావడం అవసరం.
This post was last modified on December 15, 2025 4:52 pm
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…
ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…
అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి…