బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అందుక్కారణం ఆమె పెట్టిన కొన్ని షరతులే కారణమని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి 8 గంటల పని విధానం. రోజుకు కచ్చితంగా 8 గంటలే పని చేస్తానని.. అంతకుమించి కుదరదని ఆమె తేల్చి చెప్పడం.. దీనికి తోడు వేరే డిమాండ్లు కూడా చేయడంతో తప్పక ఆ రెండు సినిమాల నుంచి మేకర్స్ ఆమెను తప్పించినట్లు ప్రచారం జరిగింది.
తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె 8 గంటల పని విధానం విషయంలో తాను కచ్చితంగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. కొందరు సినీ జనాలు దీన్ని సమర్థించారు. ఎక్కువమంది వ్యతిరేకించారు. ఐతే స్వయంగా దీపిక భర్త రణ్వీర్ సింగ్.. దీపికకు వ్యతిరేకంగా నిలవడం విశేషం. 8 గంటల పని విధానానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలంటే కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.
కాకపోతే అతను ఆ వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు కాదు. 2022లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణ్వీర్ ఈ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు దీపిక 8 గంటల పని విధానానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిన నేపథ్యంలో తన పాత కామెంట్ల తాలూకు వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో.
‘‘చాలాసార్లు జనాలు పని సమయాల గురించి కంప్లైంట్లు చేస్తుంటారు. 8 గంటల షిఫ్ట్ అని చెప్పి 10-12 గంటలు పని చేయించుకుంటున్నారు అని అంటుంటారు. కానీ మనం అనుకున్న పని 8 గంటల్లో పూర్తి కాకపోతే.. కొంచెం అదనపు సమయం పని చేయాల్సి ఉంటుంది’’ అని రణ్వీర్ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు తన భార్య 8 గంటల పని విధానం విషయంలో కచ్చితంగా ఉంటున్న నేపథ్యంలో రణ్వీర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడా.. లేక పాత కామెంట్లకే కట్టుబడి ఉంటాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 15, 2025 3:17 pm
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…
ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…
అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…