జన నాయకుడు మీద ఏంటీ ప్రచారం

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో డిసెంబర్ 27 గ్రాండ్ ఆడియో లాంచ్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. పెద్ద ఎత్తున టికెట్లు అమ్మారు. ఈ ఒక్క ఈవెంట్ ద్వారానే యాభై కోట్ల దాకా ఆదాయం సమకూరనుందని ఒక అంచనా. దీనికి హాజరు కావడం కోసం తమిళనాడు నుంచి వీరాభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకున్నట్టు చెన్నై రిపోర్ట్. అనిరుధ్ రవిచందర్ ఇవ్వబోయే మ్యూజికల్ కన్సర్ట్ నెవర్ బిఫోర్ తరహాలో ఉంటుందని ఆల్రెడీ టాక్ ఉంది. అయితే గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం ఫాన్స్ ని టెన్షన్ పెడుతోంది.

దర్శకుడు హెచ్ వినోత్, నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కు మధ్య ఫైనల్ అవుట్ ఫుట్ కు సంబంధించి ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల చాలా పనులు పెండింగ్ ఉన్నాయని దాని సారాంశం. ఇందులో నిజమెంతుందో కానీ టీమ్ అయితే ప్రమోషన్లను తగ్గించేసింది. పెద్దగా హడావిడి కనిపించడం లేదు. ఈవెంట్ తేదీ దగ్గర పడుతున్నా దానికి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా ఇవ్వడం లేదు. అంటే అనుమానాలు నిజమేనా అంటే ఏమో అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇక్కడిదాకా వచ్చి ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే లేనిపోని రచ్చ అవుతుంది. అభిమానుల ఆగ్రహం తీవ్రంగా ఉంటుంది.

వీలైనంత త్వరగా ఈ పుకార్లకు చెక్ పెట్టడం అవసరం. తమిళంలో విడుదల చేసిన మొదటి లిరికల్ సాంగ్ ఇప్పటిదాకా తెలుగులో వదల్లేదు. డిస్ట్రిబ్యూషన్ హక్కులు నాగవంశీ కొన్నారనే ప్రచారం జరుగుతోంది కానీ ఆయన వైపు నుంచి ధృవీకరణ లేదు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఆయన స్వంత సినిమా అనగనగా ఒక రాజు పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్ టైంలో అందుబాటులోకి వస్తారు కాబట్టి అప్పుడు అడుగుదామని మీడియా ఎదురు చూస్తోంది. ఇప్పటికి ఉన్న సమాచారమైతే జన నాయకుడు మన రాజా సాబ్ తో పాటు జనవరి 9నే రానుంది. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే ప్రభాస్ మూవీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది.