Movie News

చిరు వెంకీ కలయిక… ఎంతైనా ఊహించుకోండి

మన శంకరవరప్రసాద్ గారులో వెంకటేష్ క్యామియో గురించి ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. పేరుకి గెస్టు రోల్ అంటున్నా ఇరవై అయిదు నిముషాలు అంటే చిన్న లెన్త్ కాదు. ఇద్దరు హీరో అభిమానులు ఎంజాయ్ చేయడానికి ఆ మాత్రం నిడివి సరిపోతుంది. అయితే ఈ కాంబోలో ఎలాంటి ఎపిసోడ్స్ ఉంటాయి, ఎలా కలుస్తారనే ఎగ్జైట్ మెంట్ మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. ఇన్ సైడ్ లీక్స్ అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. వాటి ప్రకారం వెంకటేష్ ఎంట్రీ చివరి నలభై నిమిషాల ముందు ఉంటుందట. ఒకప్పుడు చిరంజీవి కొలీగ్ లా ఉన్న వెంకీ కీలకమైన సందర్భంలో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిన టైంలో ఎంట్రీ ఇస్తారని వినికిడి.

ఇక్కడి నుంచి వెరైటీ కామెడీ డ్రామా మొదలవుతుందని, ఒకరి సినిమా డైలాగులు మరొకరు చెప్పుకునేలా కాకుండా, ఒకరి బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి మరొకరు డాన్స్ చేసేలా అనిల్ రావిపూడి మెంటల్ మాస్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అంటే బొబ్బిలి రాజా బీట్స్ కి చిరంజీవి, గ్యాంగ్ లీడర్ బిట్స్ కి వెంకటేష్ కాలు కదిపితే ఎలా ఉంటుందో అలా అన్న మాట. ఇక్కడ కేవలం ఉదాహరణ చెప్పాం కానీ ఖచ్చితంగా ఇవే ఉంటాయని కాదు. పబ్బు సాంగ్ తర్వాత వచ్చే క్లైమాక్స్ ఫైట్ కూడా ఎఫ్3ని మించి హిలేరియస్ గా డిజైన్ చేశారట. అప్పటిదాకా రెండో గేర్ లో నడిచిన సినిమా ఒక్కసారిగా ఈ కాంబోతో ఫోర్త్ గేర్ లోకి వెళ్ళిపోతుందట.

ప్రమోషనల్ కంటెంట్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి చేతిలో నెల రోజులు కూడా లేకపోవడంతో పబ్లిసిటీ పరంగా ఏమేం చేయాలో మొత్తం లిస్టు రాసి పెట్టుకున్నారు. మాములుగా అయితే బాబీ కొల్లి దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించే సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలు కావాల్సి ఉంది. కానీ అనిల్ స్పెషల్ రిక్వెస్ట్ మీద చిరంజీవి దాన్ని వాయిదా వేయించి జనవరికి షిఫ్ట్ చేసినట్టు సమాచారం. మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యే వరకు ఇంకే కార్యక్రమాలు పెట్టుకోకుండా మెగాస్టార్ ఓకే చెప్పారట. డబ్బింగ్ తదితర ఫార్మాలిటీస్ వచ్చే వారం నుంచి ఊపందుకోబోతున్నాయి.

This post was last modified on December 15, 2025 10:47 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago