సోమవారం వచ్చేసింది. ఎంత పెద్ద సినిమా అయినా వీక్ డేస్ మొదలుకాగానే థియేటర్ ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుంది. కాకపోతే అది ఎంత మొత్తమనేది హిట్ స్టేటస్ నిర్ణయిస్తుంది. మొదటి మూడు రోజులు అఖండ తాండవం 2 కలెక్షన్లు బాగున్నాయి. కొన్ని ఏరియాల్లో టాక్ తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్స్ పడ్డాయి. నిర్మాత దిల్ రాజు చెప్పిన ప్రకారం నైజామ్ 70 శాతం రికవరీ అయిపోయిందంటే రికార్డు కిందే లెక్క. సీడెడ్ లోనూ పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి. అయితే సీక్వెల్స్ మీద ఉండే హైప్ తో పోల్చుకుంటే అఖండ 2 కొంచెం వెనుకబడి ఉన్న మాట వాస్తవమే కానీ బాలయ్య ఇమేజ్, అఖండ బ్రాండ్ అండగా నిలబడ్డాయి.
ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. అఖండ 1లాగా యునానిమస్ రెస్పాన్స్ లేకపోవడం అఖండ 2 మీద ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. అందులోనూ ప్రీమియర్ల దగ్గరి నుంచి ఏపీలో రెగ్యులర్ షోలకు పది రోజుల దాకా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు తీసుకోవడం ప్రతికూలంగా మారే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో బాలయ్యకు మాస్ ఆడియన్స్ అండ ఎక్కువ. మళ్ళీ మళ్ళీ చూసే వీరాభిమానులు ఉంటారు. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే ఒకటికి పది టికెట్లు తెంపుతారు. కానీ సింగల్ స్క్రీన్లలో సైతం 75 రూపాయలు పెంపు అనేది ఎఫెక్ట్ చేసేదే.
ఒకవేళ అఖండ 2 కనక ఈ వారం స్టడీగా ఉంటే గట్టెక్కినట్టే. నిన్న సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. నిర్మాతలు లేకుండా టీమ్ మొత్తం హాజరు కాగా తమ అనుభవాలను సుదీర్ఘంగా పంచుకున్నారు. బాలకృష్ణ నమ్మకం చూస్తుంటే అయిదో బ్లాక్ బస్టర్ ఇచ్చేశాననే రీతిలో మాట్లాడారు. నిజంగా ఓ రెండు వారాలు సాలిడ్ రన్ దక్కించుకుంటే అది నెరవేరినట్టే. ఎగుడుదిగుడుగా సాగితే మాత్రం చిక్కులు తప్పవు. ఇంకా బ్రేక్ ఈవెన్లు కాలేదు. టార్గెట్ పెద్దది కావడంతో కొంచెం ఎక్కువే ఎదురు చూడాల్సి ఉంటుంది. మూడు రోజులకు సంబంధించిన గ్రాస్ లెక్కలు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. సెంచరీ గ్రాస్ అయితే దాటిందని టాక్.
This post was last modified on December 15, 2025 10:42 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…