ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా ఏడు సినిమాలు పోటీలో ఉండటంతో బయ్యర్ల అగచాట్లు భారీ ఎత్తున తలెత్తనున్నాయి ముఖ్యంగా బిసి సెంటర్లలో షోలు అడ్జస్ట్ చేయడం, మల్టీప్లెక్సుల్లో పంపకాలు పెద్ద తలనెప్పి అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ తెలంగాణలో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉంటాయా లేదానే దాని గురించి. సందర్భం వచ్చింది కాబట్టి మన శంకర వరప్రసాద్ గారు నిర్మాత సాహు గారపాటి, రాజా సాబ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తమ వెర్షన్లు వినిపించారు.
ప్రయత్నాలు చేస్తామని, ఫైనల్ గా ప్రభుత్వాలు, కోర్టులు చెప్పినట్టు వినాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈసారి సంక్రాంతి నిర్మాతలు ముందుజాగ్రత్త చర్యగా ఏమేం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారట. ప్రధానంగా వస్తున్న సమస్య ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం కాబట్టి తామే జాగ్రత్త పడి వెంటనే కౌంటర్లు దాఖలు చేసేందుకు ఏమేం కావాలో అవన్నీ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఉదాహరణకు ఒక సినిమాకు రెండు వందల కోట్ల బడ్జెట్ అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిద్ధంగా ఉంచుకుని, పెంపు ఇవ్వకపోతే వచ్చే నష్టాలను వివరించేలా వెర్షన్లు రెడీ చేస్తున్నారట.
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన ప్రకారం ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు ఉండవని చెప్పారు కానీ పండగ టైంకి పరిస్థితిలో మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఒకవేళ హైక్ లేకపోయినా ఇప్పుడున్న గరిష్ట ధరలతో పాటు ఏపీలో ఎలాగూ పెంపు వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా బిజినెస్ బ్యాలన్స్ చేసేలా మరో ప్లాన్ రెడీ చేశారట. ఇప్పుడే ఏదీ తేలదు కానీ అఖండ 2 విషయంలో మరో పది రోజుల్లో వచ్చే తీర్పు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఇక్కడ చర్చించిన దాంట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు. అప్పటిదాకా ఈ సంకటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
This post was last modified on December 14, 2025 10:04 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్…