మనసు మార్చుకుంటున్న దురంధర్ 2

రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. పదో రోజు ముంబై నగరంలో అర్ధరాత్రి 12 గంటలకు, తెల్లవారుఝామున 4 గంటలకు రౌండ్ ది క్లాక్ షోలు వేయడం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు షాక్ తింటున్నారు. హైదరాబాద్ మెయిన్ స్క్రీన్స్ లో ఎక్కడా టికెట్ ముక్క లేదు. అఖండ 2 కాంపిటీషన్ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లో ఇంత దూకుడు మీద ఉండటం ఆశ్చర్యమే. డబ్బింగ్ వెర్షన్లు డిసెంబర్ 19 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు మ్యాటర్ ఇది కాదు. సీక్వెల్ గురించి.

దురంధర్ 2 వచ్చే ఏడాది మార్చి 19 విడుదల చేస్తామని నిర్మాతలు ఎండ్ కార్డులో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని వినికిడి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ కేవలం వంద రోజుల గ్యాప్ లో రావడం సేఫ్ కాదని, అందుకే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా చేసుకుంటే భారీ వసూళ్లు సొంతం చేసుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట. పైగా పార్ట్ 2కి సంబందించిన పెండింగ్ వర్క్స్ ఇంకా ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య ధార్ మీద ఇప్పుడు బాధ్యత పెరగడంలో ప్రతి అంశాన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

చూస్తుంటే దురంధర్ 2 మార్చిలో రావడం అనుమానమేనని ముంబై వర్గాలు అంటున్నాయి. ఎలాగూ యాభై రోజుల తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ ఉంటుంది. డిజిటల్ లోకి వచ్చాక దురంధర్ రీచ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాని నిషేధించిన అరబ్ తదితర దేశాల సినీ ప్రియులు ఎగబడి చూస్తారు. అందుకే సీక్వెల్ కి స్పేస్ ఉంటే బాగుంటుందనే కోణంలో ప్రొడ్యూసర్లు ఆలోచనలో పడ్డారట. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే ఈ డిస్కషన్ ఉండేది కాదు కానీ ఊహలకు మించి సక్సెస్ కావడం దురంధర్ టీమ్ మీద తీయనైన ఒత్తిడి తీసుకొచ్చింది. దాన్ని ఎంజాయ్ చేయడం బాగానే ఉంది కానీ రెండో భాగం ఎప్పుడో తేల్చేస్తే బెటర్.