సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు బాగా కనెక్ట్ కాగా జాజికాయ జాజికాయ సాంగ్ అఖండ 1లో జై బాలయ్య రేంజ్ లో కంపోజ్ కాలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఫీడ్ బ్యాక్ కొంచెం పాజిటివ్ కొంచెం నెగటివ్ అన్నట్టుగా వచ్చింది. బీజీఎమ్ గురించి బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. కానీ సౌండ్ ఎక్కువయిందని, మిక్సింగ్ కొంచెం సరిగా జరగలేదని సోషల్ మీడియాలో ఏవేవో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు తమన్ కు ప్రత్యేక అభ్యర్థన పెట్టుకుంటున్నారు. దేని గురించో తెలిసిందేగా.
ఇంకో పాతిక రోజుల లోపే రాజా సాబ్ వచ్చేస్తాడు. ప్రభాస్ చేసిన మొదటి హారర్ కామెడీ డ్రామా ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వందల కోట్లు ఖర్చు పెట్టింది. ఆల్రెడీ వచ్చేసిన టైటిల్ సాంగ్ అనుకున్న స్థాయిలో వైరల్ అవ్వలేదని అభిమానులు వాపోయారు. రేపు వచ్చే సెకండ్ సాంగ్ అంచనాలకు మించి ఉంటుందని నమ్ముతున్నారు. అయితే వాళ్ళ కోరిక ప్రధానంగా బీజీఎమ్ గురించి. రాజా సాబ్ చాలా డెప్త్ ఉన్న హారర్ కం కమర్షియల్ సబ్జెక్టు. రకరకాల మూడ్స్ ఉంటాయి. సలార్, కల్కి లాగా ఒకే ఫ్లో ఉండదు. ప్రతి ఎపిసోడ్ కు షేడ్స్ మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మ్యూజిక్ పడాలి.
తమన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫైనల్ కాపీ ఇంకో వారంలో రెడీ అయిపోతుందని, రీ రికార్డింగ్ కోసం తమన్ కి ఇస్తారని ఇన్ సైడ్ టాక్. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ కు వర్క్ చేస్తున్న తమన్ ఈసారి బెస్ట్ ఇవ్వాల్సిందే. అసలే పోటీ తీవ్రంగా ఉంది. మన శంకరవరప్రసాద్ గారులో మీసాల పిల్ల చార్ట్ బస్టర్ అయ్యింది. శశిరేఖ పాట మెల్లగా వెళ్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, పరాశక్తి నుంచి తలో ఒకటి రెండు సాంగ్స్ రిలీజయ్యాయి. అవన్నీ సైడ్ అయ్యేలా తమన్ నుంచి వచ్చే రాజా సాబ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. వాళ్ళ అభ్యర్థన తీరితే చాలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates