గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు కొనసాగిస్తున్నారంటే ఎంత పాజిటివ్ గా జనంలోకి దూసుకెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రెండు వందల కోట్లకు దగ్గరగా ఉన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదివారం లోపే ఆ లాంఛనం పూర్తి చేసుకునేలా ఉంది. అయితే దురంధర్ పలు విషయాల్లో పలు వర్గాల్లో పెద్ద దెబ్బే కొట్టింది. ఉద్దేశపూర్వకంగా కొందరు ఇచ్చిన వీడియో రివ్యూలను నెటిజెన్లు రివర్స్ ఎటాక్ చేసి తీయించేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కాస్తా ముదిరి సోషల్ మీడియాలో డిబేట్ల దాకా వెళ్ళింది.
ఇంకో వైపు స్పై మూవీస్ అంటే గూఢచారులు నమ్మశక్యం కానీ స్టంట్లు చేస్తారని ఏక్ ధా టైగర్, టైగర్ జిందా హై, వార్, వార్ 2 లాంటి సినిమాలతో చూపించిన యష్ రాజ్ ఫిలింస్ ట్రెండ్ కి భిన్నంగా దర్శకుడు ఆదిత్య ధార్ అత్యంత సహజంగా దురంధర్ ని తెరకెక్కించిన విధానం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి దక్కుతున్న మద్దతు అనూహ్యం. ఈ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఏఎంబిలో షో చూసి ఒక సుదీర్ఘమైన ట్వీట్ పెట్టాడు. అందరికీ శుభాకాంక్షలు చెబుతూ తానెంత గొప్పగా ఆస్వాదించాడో పేరు పేరునా గుర్తు పెట్టుకుని మరీ ట్యాగ్ చేశాడు.
ఇది ఫ్లాప్ అవుతుందని పది రోజుల క్రితం వరకు బలంగా నమ్మిన కొన్ని వర్గాలకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. యాంటీ పాకిస్థాన్ అంటూ, అబద్దాలు చూపించారంటూ మసిపూసి మారేడుకాయలాగా నెగటివ్ గా ఏదో రుద్దాలని చూశారు కానీ దాన్ని తట్టుకుని మరీ దురంధర్ స్ట్రాంగ్ గా నిలిచాడు. ట్విస్ట్ ఏంటంటే మార్చి 19 విడుదల కాబోయే దురంధర్ 2 కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇది గమనించే అజయ్ దేవగన్ తన ధమాల్ 4 వాయిదా వేసుకున్నాడని ముంబై టాక్. ఊహించని విధంగా చాలా మందికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన దురంధర్ ఫైనల్ రన్ లోపు ఇంకా ఏమేం సంచలనాలు చేస్తాడో చూడాలి.
This post was last modified on December 12, 2025 2:34 pm
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవడం కీలకం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం…
తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్…
"తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం." ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి…