భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వచ్చాక ఆ స్థాయి సినిమాల కోసం చాన్నాళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ రిలీజ్ అప్పుడు మాత్రమే ఆ సందడి కనిపించింది. వీటిలో తొలి చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరచగా.. రెండోది మాత్రం మంచి ఊపునిచ్చింది.
‘ఓజీ’తో మొత్తంగా ఇండస్ట్రీలోనే ఒక జోష్ కనిపించింది. మళ్లీ ఇప్పుడు అలాంటి జోష్ తీసుకురాగల సినిమాగా ‘అఖండ-2’ను పరిగణిస్తున్నారు. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కడమే కాక.. అత్యధిక బిజినెస్ కూడా చేసిన సినిమా ఇది. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఐతే గత వారం రావాల్సిన సినిమాకు అనుకోని అవాంతరాలు వచ్చి సినిమా వాయిదా పడిపోవడం పెద్ద షాక్. ఐతే అన్ని అడ్డంకులనూ అధిగమించి ఇంకో వారానికే సినిమా రిలీజవుతోంది.
ఈ లేట్ రిలీజ్ వల్ల సినిమా మీద మరీ నెగెటివ్ ఇంపాక్టేమీ కనిపించడం లేదు. సినిమాకు హైప్ ఏమీ తగ్గలేదు. రిలీజ్‌కు టైం తక్కువ ఉన్నా సరే.. అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ఊపుమీద సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్‌లో కూడా రెస్పాన్స్ బాగుంది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అని స్పష్టమైపోయింది. మొత్తంగా బాక్సాఫీస్ పరంగా అన్నీ కలిసొస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుంది.. ఏ లెవెల్‌కు వెళ్తుంది అన్నది దర్శకుడు బోయపాటి పనితనం మీదే ఆధారపడి ఉంది.
బాలయ్యతో ఇంతకుముందు చేసిన మూడు సినిమాల విషయంలో ఆయనపై మరీ ప్రెజర్ ఏమీ లేదు. కానీ ఈసారి చేసింది సీక్వెల్ కావడం, దాని మీద భారీ బడ్జెట్ పెట్టేయడం, బిజినెస్ టార్గెట్లు కూడా భారీగా ఉండడం.. ఊహించని బ్రేక్ తర్వాత సినిమా రిలీజవుతుండడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన స్థితిలో ఉన్నాడు బాలయ్య. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై దృష్టి నిలిచి ఉంది.
అందరినీ మెప్పించే సినిమా ఇవ్వడం తేలిక కాదు. ‘అఖండ-2’ ప్రోమోలు చూస్తే.. మాస్ మూమెంట్స్‌కు ఢోకా లేదనిపిస్తూనే.. ఈ విషయంలో ఓవర్ ద బోర్డ్ వెళ్లారా అనే సందేహాలకు తావిచ్చింది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పఠించిన ‘సనాతన ధర్మం’ మంత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ స్థితిలో పెద్ద హిట్ డెలివర్ చేయడం బోయపాటికి సవాలే. మరి బాలయ్యతో సక్సెస్ స్ట్రీక్‌ను బోయపాటి కొనసాగిస్తారా.. తమ కాంబో మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే బ్లాక్ బస్టర్ అందిస్తారా అన్నది చూడాలి.
This post was last modified on December 11, 2025 12:07 pm
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…