గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే జరిగిందనే తరహాలో సంకేతాలు ఇస్తోంది. ప్రీమియర్ల బుకింగ్స్ జోరు మీదున్నాయి. హైదరాబాద్ రెగ్యులర్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ చూపిస్తుండగా బుక్ మై షో కన్నా ముందే సింగల్ స్క్రీన్ బెనిఫిట్ షో టికెట్లు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల దాకా బ్లాక్ లో అమ్ముతున్నట్టు సోషల్ మీడియా టాక్. అది నిజమా కాదానేది పక్కనపెడితే అఖండ 2కి గతంలో కంటే ఇప్పుడు మూమెంట్ బాగుండటం శుభ పరిణామం. ఏపీలో సీడెడ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గ్యారెంటీ అంటున్నారు.
బాక్సాఫీస్ వద్ద అఖండ 2కి చెప్పుకోదగ్గ పోటీ లేదు. ఒక రోజు ఆలస్యంగా వస్తున్న మోగ్లీ, అన్నగారు వస్తారు బజ్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కాకపోతే టాక్ ని నమ్ముకుని ఖచ్చితంగా హిట్ కొడతామనే ధీమా ఆయా బృందాల్లో ఉంది. కానీ బాలయ్య ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ లో ఉంది. క్రేజీ సీక్వెల్ కావడంతో పాటు ట్రైలర్ లో చూపించిన విజువల్స్ కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలైన ఊచకోత తెరమీద చూస్తారని నిర్మాత రామ్ ఆచంట ఊరించడం చూస్తే అంచనాలు పెరిగిపోతున్నాయి. అర్ధరాత్రికే పూర్తి టాక్ వచ్చేస్తుంది కాబట్టి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అఖండ 2 మీద భారీ టార్గెట్లున్నాయి. రెండు వందల కోట్ల గ్రాస్ పక్కాగా వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సంక్రాంతి ఇంకా దూరంలో ఉండటం, పెద్ద హీరోల సినిమాలు అప్పటిదాకా లేకపోవడం సానుకూలాంశంగా మారుతోంది. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చాక దర్శకుడు బోయపాటి శీను నాలుగుసారి బాలయ్యతో చేతులు కలిపారు. మళ్ళీ ఈ ఫీట్ రిపీట్ చేస్తామనే నమ్మకం ఇద్దరిలోనూ ఉంది. కేవలం ఒకే డ్యూయెట్ సాంగ్ పెట్టి మిగిలినదంతా హై వోల్టేజ్ భక్తి పాటలు ఇచ్చిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లి ఉంటే థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్ వీడిపోతుంది.
This post was last modified on December 11, 2025 11:04 am
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…
ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం…
చంద్రబాబు గవర్నమెంట్ లో అన్నింటికీ ఒక లెక్క ఉంటుంది... అది పక్కాగా ఉంటుంది. కేవలం నోటిమాటలు కాకుండా ప్రతిదానికి డేటా…
హైదరాబాద్లోని చరిత్రాత్మక విశ్వవిద్యాలయం.. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ). అనేక మంది మేధావులను మాత్రమే ఈ దేశానికి అందించడం కాదు.. అనేక ఉద్యమాలకు…
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. గత 2020-21 మధ్య జరిగిన…